Search
Tuesday 19 June 2018
  • :
  • :

మాటల గారడీతో పాలన సాగిస్తున్న టిఆర్‌ఎస్

cpm

మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ రూరల్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మత రాజ్యాన్ని స్దాపించడానికి పావులు కదుపు తుందని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ఘాటు గా విమర్శించారు. శనివారం మండల పరిధిలోగల యా ద్గార్ పల్లి గ్రామం శుభోదయ ఫంక్షన్ హాల్‌లో రమేష్ బాబు, సైదమ్మల అధ్యక్షతన నిర్వహించిన సిపిఐఎం పార్టీ 6వ మండల మహాసభకు ముఖ్య అధితిగా హాజరై ఆయన మాట్లా డారు. మోడీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలపై దాడులు నిర్వహిస్తూ భయ భ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అత్యంత రహస్యంగా, అక స్మాత్తుగా తీసుకువచ్చిన నోట్ల రద్దుతో ఒరిగిందేమి లేదని ఎద్దేవా చేశారు. పైసా నల్లధనాన్ని బయటకు తీసుకురాక పోగా బడాబాబులకే లాభం చేకూర్చిందని అన్నా రు. జీఎస్టీ తీసుకు రావడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డచం దం గా ఉందన్నారు. జీఎస్టీతో మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు పెరిగి పేద ప్రజల జీవనం అగమ్య గోచరంగా ఉందన్నారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం మాటాల గారడీతో పరిపాలన కొనసా గిస్తుందని అన్నారు. లక్ష ఉద్యోగాలు హామీ ఎమైందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కుటుంబ పాలనతో విసిగి వేసారి పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వాలు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని లేని పక్షం లో ప్రజలను చైతన్య పరచి ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాలకుల తప్పిదాలను ఎండ గడతామని అన్నారు. పార్టీలో ఉన్న అన్ని శాఖలను సమన్వయ పరచడంతో పాటు ప్రజల చైతన్య పరచి సామా జిక తెలంగాణ కోసం ఉద్యామాలను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వీరేపల్లి వెంకటేశ్వర్లు, డబ్బీకార్ మల్లేష్, మాలి పురుషోత్తం రెడ్డి, రవినాయక్, ఇంద్రారెడ్డి, సత్యనా రా యణ రెడ్డి, జగదీశ్ చంద్ర, మహ్మద్‌బీన్ సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments