Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

LORRY-ACCIDENT

కడప : పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్ట వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు యువకులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ స్వస్థలాలకు కారులో తిరిగి వెళుతున్న సమయంలో రెడ్డిపల్లె చెరువు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జయి ఘటనాస్థలిలోనే ఇద్దరు యువకులు చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Two killed in road accident

Comments

comments