Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

School Bus Collided to Lorry in Road Accident in AP

రంగారెడ్డి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో మృతిచెందిన ఘటన రంగారెడ్డిలోని నందిగామ మండలం వీర్లపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులను బిహార్‌కు చెందిన విక్రమ్, రామేశ్వర్‌గా గుర్తించారు. మహావీర్ స్టీల్ పరిశ్రమలో వీరు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two killed in Road Accident in Rangareddy.

Comments

comments