Search
Tuesday 19 June 2018
  • :
  • :

తీరని నోటు కష్టాలు

cash

*పెద్దనోట్ల రద్దుతో చితికిన చిన్న బతుకులు
*కొనుగోళ్లు లేక సాగిలపడ్డ వ్యాపారం
*తీవ్ర ఇబ్బందులు పడ్డ సామాన్యుడు
*పనులు మానుకుని గంటల తరబడి క్యూలైన్లోనే..
*నేటితో నోట్ల రద్దుకు ఏడాది

2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు అవుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు… ఆ తరువాత పెద్ద నోటు మార్పు కోసం బ్యాంకుల ఎదుట పడిగాపులు.. మరోవైపు  డబ్బులు తీసుకునేందుకు బ్యాంకులు, ఎటిఎం సెంటర్ల వద్ద బారెడంత క్యూలైన్లు… ఇలా సామాన్యులు అష్టకష్టాలు పడగా, వ్యాపారులు కొనుగోళ్లు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇలా నాలుగైదు నెలలు నోటు కష్టాలు అందరినీ వెంటాడాయి… నేటితో నోట్లు రద్దై ఏడాది పూర్తి అయిన సందర్భంగా ప్రత్యేక కథనం….

మనతెలంగాణ/ ఆదిలాబాద్ బ్యూరో/ మంచిర్యాల ప్రతినిధి : దేశ వ్యాప్తంగా పెద్దనోట్లను ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రద్దు చేసిన నేపథ్యంలో సామాన్యులు నేటికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాత పెద్దనోట్లను రద్ధు చేసి, బు ధవారం నాటికి సంవత్సర కాలం అవుతుండగా సామాన్య ప్రజలకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. నోట్లను రద్దు చేసిన సమయంలో పెద్దనోట్లను మార్చుకునేందుకు అనేక ఇబ్బందులకు గురికాగా ప్రస్తుతం నూతనంగా విడుదలైన రూ. 2 వేల నోటు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం నేటికి ప్రజలపై ప్రభావం చూపుతోంది. జిల్లా వ్యాప్తంగా జాతీయ బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంక్‌లు, కో-ఆపరేటివ్ బ్యాంక్‌లలో కూడా నేటికి డబ్బులను తీసుకుంటే పెద్దనోట్లనే ఇస్తున్నారు. పాత రూ. 1000, 500 నోట్లను రద్దు చేయడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి స్థానంలో రూ. 2 వేలను మొదట, తరువాత రూ.500 విడుదల చేయగా రూ.2000 నోటుతో చిల్లర కోసం ఏమి కొనుగోలు చేయలేని పరిస్థితు లు ఎదురయ్యాయి. ఇప్పటికి రూ.2000 నోటును విడిపించాలంటే సామాన్యులకు చెమటలు పడుతున్నాయి. కిరా ణం, తదితర వ్యాపార సంస్థల్లో యాజమానులు రూ. 2 వేల నోటును తీసుకోకపోవడం చిన్ననోట్లు లభించకపోవడంతో జనం నానా తంటాలు పడుతున్నారు. బడా వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులు సామాన్య ప్రజానీకం నోట్ల రద్దు కారణంగా అవస్థల పాలవుతున్నారు. నగదు రహిత లావాదేవీలు కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాగా జి ల్లా కేంద్రాలు పట్టణాల్లో అంతంత మాత్రంగానే సాగుతోం ది. నోట్ల రద్దు అనంతరం పలు బ్యాంక్‌లు నగదు రహిత లావాదేవీల కోసం పలురకాల డెబిట్, క్రెడిట్ కార్డులు,పేటిఎంలను ఏర్పాటు చేసినా ఫలితం కానరాలేదు. పలు చోట్ల ఏటిఎంలలో కూడా బ్యాంక్ అధికారులు రూ. 2 వేల నోట్లనే పెట్టడంతో చిల్లర కోసం ఇప్పటికి కష్టాలు తప్పడం లేదు. బ్యాంకుల్లో సైతం నగదు నిల్వలు తగ్గడం, రిజర్వుబ్యాంకు నుంచి చిన్ననోట్లు అందకపోవడంతో బ్యాంక్ అధికారులు సైతం ఖాతారులకు పెద్ద నోట్లను అంటకట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్‌లో చిన్న నోట్ల లభించకపోవడంతో వ్యాపారులు, సామాన్య ప్రజలు లబోదిబోమంటున్నారు. చేతిలో పెద్దనోట్ల దండిగా ఉన్న చిల్లర లేక ఏమి చేయని పరిస్థితుల్లో జనం గందరగోళానికి గురవుతున్నారు. హోటళ్లు, దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లలో రూ. 2 వేల నోట్ల ను కొందరు ఇప్పటికి తీసుకోవడం లేదు. నల్ల ధనం నియంత్రణకు ప్రధాని తీసుకున్న సంచలన నిర్ణయం మంచిదేకాని, చిల్లర కోసం జనం అగచాట్లకు గురవుతున్నారు.
రూ. 2000 చిల్లర ఇవ్వడం లేదు
నోట్ల రద్దు తరువాత మార్కెట్‌లోకి వచ్చిన రూ. 2000 నో టుతో ఏమి కొనుగోలు చేయలేక పోతున్నాము. కిరాణ షా పుల్లోకి వెళ్తే రూ. 2000 నో టును చూడగానే వస్తువులు ఇ వ్వలేకపోతున్నాం. బ్యాంక్‌లో కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకున్న బ్యాంక్ వారు 2000 నోట్లనే ఇస్తున్నారు. ఇటీవల రూ.50 నోటు రావడంతో కొంత మేరకు ఊరట కలిగింది.
– ఎం. స్రవంతి, గృహిణి, ఆసిఫాబాద్.
చిల్లర కోసం తప్పని తిప్పలు
ప్రతిరోజు చిల్లర కోసం తిప్పలు పడుతున్నాం. ప్రయాణీకు లు రూ. 2000 నోట్లు ఇస్తే చి ల్లర ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నాం. నోట్ల రద్దుతో గిరాకీలు సాగడం లేదు. బ్యాం కులకు వెళ్లిన చిన్ననోట్లు ఇవ్వడం లేదు. రూ. 200 నోటు మార్కెట్‌లోకి వస్తే కొంత ఇబ్బందులు తప్పుతాయి.
– మున్నా ఆటోడ్రైవర్ మంచిర్యాల.
వ్యాపారాలు సాగడం లేదు
నోట్ల రద్దు వలన ఆరు నెలల పాటు వ్యాపారాలు సాగలేదు. ఇప్పుడు రూ. 2 వేల నోటుతో చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నాం. నోట్ల రద్దు ప్రభావం చిరువ్యాపారులపై ఎంతగానో పడింది. ఇప్పటికి చిల్లర లభించక గిరాకీని వాపస్ పంపిస్తున్నాం.మార్కెట్‌లోకి రూ. 50 నోట్లను పెద్ద ఎత్తున విడుదల చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి. నల్లదనం వెలికి తీతకు ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దు మంచిదే కాని సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపింది.
– వి. కిరణ్ చెప్పుల వ్యాపారి.
నల్ల ధనాన్ని రూపుమాపాలనే సంకల్పంతో గత ఏడాది నవంబర్ 8న చెలామణిలో ఉన్న 1000, 500 పెద్ద నోట్లను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో సుమారు ఆరు నెలల పాటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ రెండు జిల్లాలలో అధిక శాతం మంది రెక్కాడితే డొక్కాడని వారే ఉన్నారు. ప్రధానంగా ఆదిలాబాద్, భైంసాలలో పెద్ద ఎత్తున జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఉన్న కారణంగా దినసరి కూలీలు ఎక్కువగా పని చేస్తుంటారు. ఈ ఏడాది మార్చి వరకు చిల్లర నోట్ల కోసం దినసరి కూలీలు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. కేంద్ర ప్రభుత్వం 2000, 500 నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చినా అవసరం మేరకు నగదు లభించకపోవడం, వాటికి కావాల్సిన చిల్లర కోసం ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట క్యూ కట్టాల్సి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యాపార సంస్థలతో పాటు వివిధ వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. శుభకార్యాలు, ఆకస్మికంగా మరణించిన వారి కుటుంబాల వారు నగదు కోసం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఐదు వందల రూపాయలతో పాటు 100,200,50 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకొని రావడంతో ఇబ్బందులు కొంత మేర దూరమయ్యాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో 40 శాతం మేరకు నగదు రహిత లావాదేవీలను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదిలాఉంటే పెద్ద నోట్ల రద్దు అనంతరం రోజువారి కూలీలకు ప్రతి రోజు కూలీ దొరకక పోవడం, బ్యాంకులలో నిబంధనలను కఠినతరం చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివిధ వర్గాల ప్రజలు వారి మాటల్లోనే…
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ ఇబ్బందులే
వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేయడంతో ఇప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులలో రుణాలు ఇవ్వక పోవడంతో ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించాల్సి వచ్చింది. గత ఏడాది నోట్లు రద్దయినప్పుడు సైతం డబ్బులు దొరకక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం చిల్లర కోసం ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ నోట్ల రద్దు తరువాత అవసరం ఉన్నప్పుడు అప్పులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి.
                                                                                                                                                                                        – గడ్డం చిన్నయ్య, రైతు, తంతోలి

Comments

comments