Search
Tuesday 19 June 2018
  • :
  • :

నిరుద్యోగులూ నిరాశ వద్దు

etala

27,874 కొలువుల భర్తీ ప్రక్రియ పూర్తయింది
మరి 34,625 నియామకాల సరళి కొనసాగుతోంది
ప్రాజెక్టులను అడ్డుకున్న మాదిరిగానే జాబ్‌లకు అవరోధం సృష్టిస్తున్నారు
73 నోటిఫికేషన్లు జారీ కాగా, 270 కేసులు వేశారు
శాసనసభ లఘు చర్చకు సమాధానంలో మంత్రి ఈటల

 హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకు న్న మాదిరిగానే ఉద్యోగ నియామకాలను అడ్డుకునేందుకు, తద్వా రా అశాంతి పెరగాలని కొందరు నీచమైన ఆలోచన చేస్తున్నారని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టిఎస్‌పిఎస్‌సి 73 నోటిఫికేషన్లు జారీ చేస్తే, కోర్టుల్లో 270 కేసులు వేశారని, అలాంటి ప్రయత్నాలు ఎవరూ చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులు నిరాశకు గురి కావద్దని, ఉద్యోగాలు, ఉపాధిని కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మొత్తం ఐదేళ్లలో 1.08 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ను భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగంలో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయ న వివరించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్’పై శాసనసభలో మంగళవారం జరిగిన లఘు చర్చకు మంత్రి ఈటల సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1,08,132 ప్రభు త్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండగా, గత మూడేళ్లలో 27,874 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని, మరో 34,625 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు వివిధ శాఖలలో పనిచేస్తున్న దాదాపు 2.20 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతభత్యాలను గణనీయంగా పెంచి వారిని వెట్టిచాకిరి నుంచి విముక్తి చేశామని ఆయన తెలిపారు. నిరుద్యోగ సమస్య తగ్గుతున్న రాష్ట్రాలలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ 8వ స్థానంలో ఉందని వివరించారు. చదువంటేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే భావన సరైంది కాదని, రెండు శాతం కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవ న్నారు. రాష్ట్రంలో 4,41,995 ప్రభుత్వ ఉద్యోగాలుండగా, ప్రస్తు తం 3,33,863 ఉద్యోగులు పనిచేస్తున్నారని, 1,08,132 ఉద్యోగాలు ఖాళీలుండగా వాటిలో 27,874 ఖాళీలను భర్తీ చేశామని, మరో 34,625 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనరసాగుతున్నదని మంత్రి వివరించారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 5,932 ఉద్యోగాలను సింగరేణిలో 7,266, విద్యుత్ శాఖలో 1,427, పోలీసు శాఖలో 12,157 పోస్టులను భర్తీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రూ. 1500 కోట్లు కేటాయించామని చెప్పారు. కమల్‌నాథన్ కమిటీ ఇప్పటికి వంద శాతం ఉద్యోగ విభజన పూర్తి చేయలేదని, ఇంకా 1400 మంది ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి) ఇతర రాష్ట్రాల కంటే సమర్ధవంతంగా పని చేస్తుందని,ఇప్పటివరకు 73 నో టిఫికేషన్లు ఇచ్చిందన్నారు. ఐటి రంగంలో తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో ఉందని, 2014 -17 మధ్య ఐ టీ ఎగుమతులు రూ.30 వేల కోట్ల మేరకు పెరిగాయ ని మంత్రి తెలిపారు. ఆపిల్ కంపెనీ బెంగళూరుకు తరలిపోయిందనడంలో వాస్తవం లేదని, ఇక్కడే ఏర్పాటు అవుతోందని, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, పెట్టుబడుల ద్వారా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. 1998,2012 డిఎస్‌సి క్వాలిఫైడ్ విషయంలో ముఖ్యమంత్రి ఇప్పటికీ 20 సార్లు అడ్వొకేట్ జనరల్‌తో మాట్లాడారని సభ్యుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ప్రతిపక్షాల వాకౌట్
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసనసభలో జరిగిన లఘు చర్చకు మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఐ(ఎం) పక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష ధోరణికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు సిఎల్‌పి ఉప నేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. గత మూడేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్ధులు, నిరుద్యోగులను ప్రభుత్వం నిర్లక్షం చేయడాన్ని నిరసిస్తూ వాకైట్ చేస్తున్నట్లు బిజెపి పక్ష నాయకులు జి.కిషన్‌రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పదేళ్ళలో కంటే ఎక్కువ భర్తీ : హరీశ్
గత కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లలో భర్తీ చేసిన వాటి కంటే ఎక్కువగా టిఆర్‌ఎస్ మూడేళ్లలో 27 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ప్రతిపక్షాల వాకౌట్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ కాం గ్రెస్, బిజెపి చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు. మూడేళ్లలో మూడున్నర కోట్ల ఉద్యోగాలివ్వాల్సిన బిజెపి ప్రభుత్వం మూడున్నర లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకున్న అడ్వకేట్ల ముఠానే ఉద్యోగాల నియమకాలపై కూడా కేసులు వేస్తున్నదన్నారు.

Comments

comments