Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

అంచనాలను అధిగమించిన మహీంద్రా

 కంపెనీ లాభం రూ.1,332 కోట్లతో 25 శాతం జంప్

Mahendraన్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ ముగింపునాటి రెండో త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ. 1,332 కోట్లతో 24.79 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ .1,067 కోట్లుగా ఉంది. మరోవైపు సంస్థ మొత్తం ఆదాయం రూ.12,182.07 కోట్లు నమోదవగా, గత ఏడాది ఇదే కాలంలో రూ .11,446.14 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో 1,29,754 యూనిట్లు విక్రయించింది. దీనిలో ట్రాక్టర్ల విభాగంలో 76,984 యూనిట్లు విక్రయించగా, 11,755 యూనిట్లను ఎగుమతి చేసింది. ఇబిఐటిడిఎ 45.6 శాతం పెరిగి రూ. 1729.8 కోట్లుగా నమోదైంది. ఆటో బిజినెస్‌లో మహీంద్రా అద్భుతమైన వృద్ధిని సాధించింది. పాసింజర్, యుటిలిటీ వెహికల్, ట్రక్కుల విభాగంలో వరుసగా 13.4 శాతం, 27 శాతం 86 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతోపాటు సాధారణ రుతుపవనాల కారణంగా ట్రాక్టర్ల వ్యాపారం కూడా 37 శాతం పెరుగుదలను సాధించింది. ఏడాది జూలై నుంచి జీఎస్‌టీ అమలు కారణంగా ఈ గణాంకాలు పోల్చదగినవికాదని కంపెనీ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే 1: 1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలిపింది. రూ.5 బోనస్ చెల్లించనున్నట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదాన్ని కోరనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో మహీంద్రా షేరు విలువ 2.48 శాతం పెరిగి రూ.1,395కు చేరుకుంది.

Comments

comments