Search
Wednesday 22 November 2017
  • :
  • :

యూరియా తయారీకి మూత్ర బ్యాంకులు

nitin

లీటరుకు రూ.1 చెల్లింపు: గడ్కరీ యోచన 

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి ఓ కొత్త ఆలోచన ఉంద ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. యూరియాను తయారు చేయడానికి ప్రతి తాలూకా/తహసీల్‌లో మూత్ర బ్యాంకులు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందన్నారు. అలా తయారైన యూరియాను రైతులకు ఎరువుగా ఇస్తామన్నారు. యూరియా దిగుమతిపై రైతులు ఎక్కువగా ఆధార పడకుండా చేయడానికే ఈ కొత్త ఆలోచన చేశామని గడ్కరీ చెప్పారు. ‘మానవ మూత్రంలో చాలా నత్రజని(నైట్రోజన్) ఉంటుంది. కానీ అదంతా వృథా అవుతుంటుంది. ఆ వృథాను సంపదగా మార్చాలన్నదే నా కోరిక. ఈ కొత్త ఆలోచనను అమలులోకి తేవడంలో ఎలాంటి హానీ లేదని నేను భావిస్తున్నాను’ అని రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. తొలి పరీక్షలను నాగ్‌పూర్ సమీపంలోని ధాపెవాడ గ్రామంలో ఉన్న ప్రయోగశాలలో చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా రైతులు 10 లీలర్ల ప్లాస్టిక్ క్యాన్‌లలో మూత్రాన్ని సేకరించి తాలూకా కేంద్రాలకు తేవాల్సి ఉంటుంది. దానికి బదులుగా ప్రతి లీటరుకు వారికి రూ. 1 చొప్పున ఇవ్వడం జరుగుతుంది.  ఈ ప్రయత్నం నగరాల్లో బదులు గ్రామాల్లోనే ఆరంభించనున్నారు. ఎందుకంటే గ్రామాల్లో లభించే మూత్రం స్వచ్ఛంగా ఉంటుంది. అదే నగరంలోని మానవ మూత్రంలో నీరు కలిసిపోతుంది ఆయన చెప్పారు. ‘ఇప్పటికే మనకు భాస్వరం, పొటాషియం సేంద్రీయ ప్రత్యామ్నాయాలున్నాయి.

Comments

comments