Search
Wednesday 22 November 2017
  • :
  • :

గంగూలీ టెస్ట్ రికార్డును బద్ధలు కొట్టనున్న విరాట్ కోహ్లి

kohli
కోల్‌కతా: శ్రీలంక మూడు టెస్టుల సిరీస్‌లో మరో రికార్డును కైవసం చేసుకునేందుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఎదురుచూస్తున్నాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు విజయాలు సాధించిన కెప్టెన్ ఎం.ఎస్. ధోని. ఆయన 60 మ్యాచుల్లో 27 గెలిచి జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నారు. ఇక సౌరవ్ గంగూలీ 49 గేములకు కెప్టెన్‌గా ఉండి 21 టెస్టులు గెలిచారు. ఇప్పుడు విరాట్ కోహ్లి ఆయన కెప్టెన్సీ రికార్డును బద్ధలు చేసేలా ఉన్నారు. శ్రీలంకతో ఆడే మూడు టెస్టుల సిరీస్‌లో దీనికి ఆస్కారం ఉంది. భారత్‌లో పర్యటించే శ్రీలంక జట్టు మూడు టెస్టులు ఆడనున్నది. ఇప్పటి వరకు 29 టెస్టులకు కెప్టెన్‌గా ఉండి 19 టెస్టులు గెలిచిన విరాట్ కోహ్లి మరి రెండు టెస్టులు గెలిస్తే దాదా ఘనతకు సమం అవుతాడు. ఒకవేళ మూడు గెలిస్తే గంగూలీ రికార్డు బద్ధలైపోతుంది. శ్రీలంకలో టీమిండియా ఐదు టెస్టులో క్లీన్ స్వీప్ చేసింది. స్వదేశంలో ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టు ప్రతీకారేచ్ఛతో రగులుతోంది. వారు గట్టి పోటీ ఇచ్చేలా కనబడుతున్నారు. భారత్‌కు రావడానికి ముందే వారు పాకిస్థాన్‌పై 20తో స్వీప్‌ను సాధించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు. కొహ్లీ సేన ఈ ఏడాది వరుసగా 8 టెస్టు సిరీస్‌లను గెలిచి మాంచి ఊపుమీదుంది. ఈ ఏడాది తొలుత శ్రీలంకను 21తో ఓడించిన టీమిండియా తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, తాజాగా శ్రీలంకపై టెస్ట్ సిరీస్‌లు గెలిచింది. ఇదే హోరు కొనసాగిస్తే రికార్డులు బద్దలవ్వడం ఖాయం. భారత్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20లు ఆడనున్నది. మొదటి టెస్టు నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆరంభం కానున్నది. మొదటి రెండు టెస్టులకు భారత జట్టులో ఉన్న క్రికెటర్లు: విరాట్ కోహ్లి(కెప్టెన్), కె.ఎల్.రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, చెటేశ్వర్ పుజార, అజింక్యా రహానె(వైస్‌కెప్టెన్), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహ(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.

Comments

comments