Search
Friday 24 November 2017
  • :
  • :
Latest News

వొడాఫోన్ రూ.458, రూ.509 ప్లాన్లు

Vodafone

న్యూఢిల్లీ: వొడాఫోన్ సంస్థ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.458, రూ.509 పేరిట ఈ రెండు ప్లాన్లు ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ల కింద రోజుకు 1జిబి డేటా, అపరిమిత కాలింగ్ ఉంటుంది. అలాగే ఉచిత రోమింగ్, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందవచ్చు.  ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ మాత్రం భిన్నంగా ఉంది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉండగా, రూ.509 ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. రూ.509 రీఛార్జ్ చేసుకున్న వొడాఫోన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అపరిమిత లోకల్ కాల్స్, రోజుకు 1జిబి డేటా లభించనుంది. అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్ భారత్‌లో ఏ నెంబర్‌కైనా చేసుకోవచ్చు. రోమింగ్‌కు కూడా ఇది ఉచితమే, రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1వేయి నిమిషాల వరకు మాత్రమే లోకల్, ఎస్‌టిడి కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్ ప్లే ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా దీనిలో కలిసి ఉంటుంది. 1 జిబి డేటా 4జి, 3జి కనెక్షన్ల రెండింటికీ వర్తిసుంది. రోజుకు 1 జిబి డేటా పరిమితి దాటిపోయిన తర్వాత బ్రౌజింగ్ స్పీడు పడిపోతుంది.

Comments

comments