Search
Sunday 17 December 2017
  • :
  • :
Latest News

డిసెంబర్ నెల నుంచి అర్చకులకు వేతనాలు

archa

*ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలు
*కుల మతాలకతీతంగా ప్రార్థన స్థలాల అభివృద్ధి
*దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి
*వెంకన్నస్వామి మహిమాన్వితుడు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

మన తెలంగాణ/బాన్సువాడ: రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాల్లో  ఏళ్ల కాలంగా పనిచేస్తున్న అర్చకులకు మార్గదర్శకాలను బట్టి డిసెంబర్ నుం డి వేతనాలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, డిసెంబర్ 1వ తేదీన వారికి గౌరవ వేతనం అందనుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం బీర్కూర్ మండలం తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులకు గాను మంత్రులు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పాల నలో దేవాలయాలకు తగిన విధంగా ప్రాధాన్యత లేకుండా పోయిం దని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో దేవాలయాలను సిఎం కెసిఆర్ అభి వృద్ధి చేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగా వెయ్యి కోట్లతో యాదా ద్రి నిర్మాణం జరుగుతోందన్నారు. అందులో భాగంగానే వెంకన్న స్వా మి దేవాలయాన్ని కూడా అభి వృద్ధి చేసేందుకు గాను రూ.13 కోట్ల నిధులను మం జూరు చేశారని, ఆ నిధులతో పనులకు శంకుస్థాపనలు చేయడా నికి తమను పంపించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షం గా ఉండాలని వేడుకుంటూ సిఎం చేసిన వరుణ యాగాల తో విస్తారంగా వర్షాలు కురిశాయని, రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రైతాంగం శ్రేయస్సును దృష్టిలో పెట్టు కొని ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా ఆదుకునేం దుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అందులో భాగం గానే రైతులకు పెట్టుబడి కింద ఎకరానికి రెండు పంట లకు గా ను ఎనిమిది వేల రూపాయలను అందిస్తోందని చెప్పారు.
వెంకన్న స్వామి మహిమాన్వితుడు…మంత్రి పోచారం
తిమ్మాపూర్ కొండపై వెలసిన వెంకన్న స్వామి మహిమాన్వి తుడని, తన పెద్ద కుమారుడికి మాటలు రాకపోతే తాను కొండపైకి వచ్చి మొక్కిన వారం రోజుల్లోనే మాటలు వచ్చాయని, అప్పటి నుండి స్వామి వారిని మనసా,వాచా, కర్మనా పూజిస్తానని చెప్పారు. తన నియోజక వర్గంలో స్వామి వెలియడం తన అదృష్టంగా బావిస్తున్నానన్నారు. దేవాలయానికి సిఎం మంజూరు చేసిన 13 కోట్ల నిధులతో ఆలయ పరిసర ప్రాంతాలలో రాజగోపురం, ప్రాకార వీధు లు, మాడ వీధులు, కోనేరు, కాటేజీలు, వంటశాల, కల్యాణ మండపం లాంటి నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. ఆలయం కింది బాగంలో ఉన్న చెరువును 5 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, తిరుపతి మాదిరిగా కాకపోయినా తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే తన లక్షమని పోచారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అప్పారావ్, సతీష్, కమ్మ సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, పెర్క శ్రీనివాస్, మెనేజర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.

Comments

comments