Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

వరంగల్ జిల్లాకు వరం మల్కాపూర్ రిజర్వాయర్

harish

ఉప్పుగల్, పాలకుర్తి, చెన్నూరు రిజర్వాయర్లను పూర్తి చేస్తాం
ప్రభుత్వం వేసే ప్రతి అడుగు
రైతు సంక్షేమం కోసమే

మనతెలంగాణ/జనగామ/లింగాలఘణపురం: వరంగల్ ఉమ్మడి జిల్లాలో భారీ నీటి సామర్ధం కలిగిన రిజర్వాయర్ లేదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసిఆర్ 10టిఎంసి సామర్ధం కలిగిన మల్కాపూర్ రిజర్వాయర్‌కు మంజూరుచేశారని, ఈ రిజర్వాయర్ వరంగల్ ఉమ్మడి జిల్లాకు వరం లాంటిందని  డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మం త్రి హరీష్‌రావులు అన్నారు. శుక్రవారం  జనగామ జిల్లాలోని నవాబ్‌పేట రిజర్వాయర్  గోదావరి నీటి విడుదల ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగసభలో స్థానిక ఎం ఎల్‌ఏ తాటికొండ రాజయ్య అధ్యక్షత వహించగా వారు పాల్గొ ని మాట్లాడుతూ ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరు అందించడ మే లక్షంగా పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే జనగా మ ప్రాంతం ఏడారిగా ఉన్నదాన్ని గోదావరి జలాలలో పునీతం చేసే విధంగా కెసిఆర్ ప్రత్యేక దృష్టితో కోట్ల నిధులను వెచ్చిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి నది జలాల ద్వారా జనగామ ప్రాంతంలో చెరువులను నింపి రైతులకు సాగునీరు అందించాలన్నారు. తద్వారా రాష్ట్రంలో జనగా మ జిల్లా  అధిక దిగుబడిని తెచ్చిన ఘనత ఈ జిల్లాకే దక్కిందని అన్నారు. లింగాల ఘనపురం మండలంలోని నవాబ్‌పేట్  గ్రా మంలో 0.442టిఎంసిల నీటి సామర్ధం గల  రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని దీని ద్వారా 5మండలాలకు 53 వేల 400ఎకరాలకు సాగునీరు అందివ్వడం జరుగుతుందని అన్నారు. ముందుగా లింగాల ఘనపురం, దేవరుప్పుల, గుం డాల, మోత్కూర్, తిరుమలగిరి,  మండలాలలోని పలు చెరువులను నింపడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి వరంగల్  జిల్లాలకు వరప్రదాయనిగా సాగునీరు అందించేందుకు లింగంపల్లి, మల్కాపూర్ ద్వారా 10.5టిఎంసిల సామ ర్ధం గల రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు సకాలంలో టెండర్లు పూర్తిచేయాలని అధికారులను
ఆదేశించారు. స్టేషన్ ఘనపూర్, పాలకుర్తి, జనగా మ నియోజక వర్గాలకు రెండు పంటలకు సాగు నీ రు అందించేందుకు సిఈ బంగారయ్యను ఆదేశించారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల గర్భిణులకు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో సంపన్నులు వాడే పరికరాలను కేసీఆర్ కిట్టుతో పాటు ఆడపిల్ల పుడితే రూపాయలు 13,000 మగపిల్లవాడు పుడితే రూపాయలు 12,000 వారి కి అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆడబిడ్డల పెళ్ళిల్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీముభారఖ్ ల ద్వారా 75, 116 రూపాయలను ప్రభుత్వం అందిస్తుందన్నా రు. రైతకు భరోసా కల్పించేందుకు రైతు పండించిన ధాన్యానికి మధ్దతు ధర కల్పించడమే కాకుం డా రైతు కు పెట్టుబడికి ఎకరాకు రూపాయలు 8.000 రైతు సమన్వయ కమిటిల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో సురక్షిత మంచినీరును మిషన్ భగీరధ ద్వారా అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకోసం సంక్షేమమే ద్వేయంగా ప్రతి అడుగు నేస్తుందని అన్నారు. అనంతరం స్థానిక ఎంఎల్‌ఎ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తు తీ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కోట్ల నిధులను వెచ్చిస్తూ ఉమ్మడి జిల్లాలకే తలమానికమైన మల్కాపురం రిజర్వాయ్‌రును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉండందన్నారు. అందు కోసం ఈ ప్రాంత సస్యశ్యమలం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తన్నీర్ హరీష్‌రావుకు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. ఆలేరు ఎంఎల్‌ఏ ప్రభుత్వ విఫ్ గొంగిడి సునిత మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గుం డాల మండలాన్ని జనగామ జిల్లా ఏర్పాటులో చేర్చడంవల్ల నేడు గుండాల మండలాన్నే సస్యశ్యామలం చేసేందుకు ఈ రిజర్వాయర్ ద్వారా 20 చెరువులను నింపడం జరుగుతుందని అన్నారు. ఎంఎల్ ఏ ముత్తిరెడ్డి మాట్లాడుతూ దేవాదుల నీటి తో జనగామ ప్రాంతం పునీతం అవుతుందని అన్నారు. పాలకుర్తి ఎంఎల్‌ఏ దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో పది సంవత్సరాలు దేవాదుల పనులను పెండింగ్‌లో పెట్టడం జరిగిందన్నారు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కోట్ల నిధులను వెచ్చించి ఏడారిగా ఉన్న జనగామ జిల్లాకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని వారు అన్నారు. అంతేకాకుండా పాలకుర్తి, ఉప్పుగల్, రిజర్వాయర్లను పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి, హరిష్‌రావులను కోరారు. ఎమ్మేల్సీ, ప్రభుత్వవిఫ్ బొడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం జనగామ జిల్లాకు వరప్రదాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ ఏ. శ్రీదేవసేన, జాయింట్ కలెక్టర్ ఎం. వనజాదేవి, ఎస్‌ఈ చిట్టిరావు, జెడ్‌పి చైర్‌పర్సన్ గద్దల పద్మ, గిరిజన సంఘం చైర్మన్ గాంధీనాయక్, గ్రంధాలయ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, మున్సిపల్, మార్కెట్ చైర్‌పర్సన్లు ప్రేమలతారెడ్డి, బండ పద్మ, ఎంపిపి బోయిని శీరిష, జెడ్‌పిటిసి గంగసాని రంజిత్‌రెడ్డి, సర్పంచ్ కత్తుల పోషమ్మ, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపెల్లి నాగెందర్, దూసరి గణపతి, సెవెల్లి సంపత్ పాల్గొన్నారు.

Comments

comments