Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

వరంగల్ సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్

kdmవరంగల్: వరంగల్ నగర సమగ్ర అభి వృద్ధికి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాకతీ య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) నూతన మా స్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆదివారం హ న్మకొండలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన అధికా రుల సమావేశంలో కుడా మాస్టర్ ప్లాన్, స్మార్ట్ సిటీ, హృ దయ్ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కా ర్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ గతంలో రూపొందించి అమలు చేస్తున్న కు డా మాస్టర్ ప్లాన్ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేద న్నారు. వరంగల్ నగర సమగ్రాభివృద్ధి, భవిష్యత్తు అభివృ ద్ధిని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నగరం చుట్టుపక్కల నూతనంగా నిర్మిస్తున్న ఔటర్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త మాస్టర్ ప్లాన్‌ను వరంగల్ అర్బన్, రూరల్, జనగాం జిల్లా పరిధి లో వచ్చే మండలాలు, గ్రామాలను కలుపుకొని రూ పొందించాలని ఆయన సూచించారు. ఇప్పటికే నూతన మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు సంబంధిత ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన సమాచారాన్ని ఆయన ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తిల కించారు. నూతన మాస్టర్ ప్లాన్‌ను డిసెంబర్ 15లోగా డ్రాఫ్ట్ సిద్ధం చేయాలని, 31వ తేదీలోగా ప్రజాప్రతినిధు లు, అధికారులు, స్టేట్ హోల్డర్స్, నగర ప్రముఖులు, వివి ధ రంగాల నిపుణులతో సమీక్షించాలన్నారు. ఆ తర్వాత జనవరి మొదటి తేదీలోగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసే విధంగా సిద్ధం చేయాలని సూచించారు. అదేవిధంగా 2018 మార్చి నాటికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిం చి ఆమోదం పొందాలా చూడాలన్నారు.
రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.600 కోట్లు..
వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటివరకు రెం డు విడతలుగా రూ.600 కోట్లు కేటాయించడం జరిగిం దన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ నిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాల కింద కేటాయించబడి న నిధులను సమన్వయం చేసుకొని నగర సమగ్రాభివృద్ధి కి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్, స్మార్ట్ సిటీ, హృదయ్ పథ కం కన్సల్టెన్సీ, ఏజెన్సీ ప్రతినిధులు, కుడా మాస్టర్ ప్లాన్ కన్సల్టెన్సీ ప్రతినిధులు రూపొందించిన పథకాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశం లో నగర మేయర్ నన్నపునేని నరేందర్, పార్లమెంటు స భ్యులు పసునూరి దయాకర్, ఎంఎల్‌ఎ వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, మున్సిపల్ కమిష నర్ శృతిఓజా, కుడా, కార్పొరేషన్ అధికారులున్నారు.

Comments

comments