Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

సోలార్ విద్యుత్‌కు ప్రోత్సాహం

G.J

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2,792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. పవన విద్యుత్‌ను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. 20 శాతం విద్యుత్‌ను సంప్రదాయక పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. చెత్త నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన చెప్పారు. నిరుద్యోగ ఎస్సీ అభ్యర్థులకు పలు సంస్థల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు

We Encourage Solar Power

Comments

comments