Search
Thursday 23 November 2017
  • :
  • :
Latest News

గెలుపే లక్షంగా పని చేస్తాం

mikeమాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి

మన తెలంగాణ/సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడమే లక్షంగా కార్యకర్తలు పని చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పటేల్ రమేష్‌రెడ్డిలు అన్నారు. గురువారం జిల్లా కేం ద్రంలోని దామోదర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లా డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ విద్యార్థుల ఆత్మబలిదానాలకు చలించే ఏర్పాటు చేసిం దని,ఎన్నికల్లో కేసీఆర్ ప్రజలను మాయమాటలతో మోసగించి అధికారం లోకి వచ్చి నియ ంతపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పూర్వ వైభవానికి కృషి చేస్తా మన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలు పే లక్ష ంగా పని చేస్తామని స్పష్టం చేశారు. టిడిపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పటేల్ రమేష్‌రెడ్డికి స్వాగతం పలుకుతూ పలువురు కాంగ్రెస్ నాయకులు, మద్ద తుదారులు శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు గోపగాని వెంకట నారా యణగౌడ్, జిల్లా నాయకులు చెవిటి వెంకన్నయాదవ్, కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, గుడిపాటి నర్సయ్య, వడ్డే పల్లి రవి, తూముల భుజంగరావు, ముదిరెడ్డి రమణారెడ్డి, భైరు వెంకన్నగౌడ్, పట్టణ అధ్యక్షులు అబ్ధుల్ రహీం, కుమ్మరికుంట్ల వేణుగోపాల్, షఫి ఉల్లా, వెలుగు వెంకన్న,బత్తుల రమేష్, గోగుల రమేష్, ఖాలేద్ అహ్మద్, అంగిరేకుల నాగార్జున పాల్గొన్నారు

Comments

comments