Search
Tuesday 21 November 2017
  • :
  • :
Latest News

త్వరలో మహబూబ్ నగర్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు

jply3అసెంబ్లీలో మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్ నగర్ అర్బన్: ఉద్యో గులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయాలను కల్పించేం దుకు గాను త్వరలోనే మహబూ బ్‌నగర్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి తెలిపారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి లకా్ష్మరెడ్డి సమాధానమిచ్చా రు. ఎంఎల్‌ఏ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యో గులు, జర్నలిస్టులు కార్పోరేట్ ఆస్పత్రిలో వైద్యం కోసం గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, వారికి ఉచిత వైద్య సదుపాయాలను అందిం చేందుకు సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు చేయని విధంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం హెల్త్‌స్కీంను అమలు చేస్తుంద న్నారు. ఆరోగ్యశ్రీలో ఉన్న సదుపాయాలను ఎంప్లాయిస్ హెల్త్‌స్కీంలో చేర్చారా? జర్నలిస్టుల కోసం వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నా రు ఎప్పటిలోగా ఇవి పూర్తిచేస్తారని ప్రశ్నించారు. పాత జిల్లాలో మాత్రమే వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేస్తారా లేక కొత్త జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నా యా? వెల్‌నెస్ సెంటర్లలో ఎంఆర్‌ఐ, సీటి స్కానింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారా అని సంబంధిత మంత్రి వివరించాలని ప్రశ్నించారు. టోల్‌ఫ్రీ నెంబర్‌ను కూడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. వీలైనంత త్వరగా వెల్‌నెస్ సెంటర్లను అందుబాటు లోకి తీసుకువచ్చి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు ఉచిత వైద్య సదుపాయాలు అందించే వెసలుబాటు కల్పించాలని, దేశంలో ఎక్కడా లేని విధంగా కెసిఆర్ ప్రభుత్వం ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని ఎంల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లకా్ష్మరెడ్డి సమాధానమిస్తూ ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా వైద్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిష్టాత్మ కంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే రాష్ట్రంలో 14 వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2 వెల్ నెస్ సెంటర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. మిగతా సెంటర్లను కూడ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటు న్నామని రానున్న రెండ్రోజుల్లో సంగారెడ్డి, వరం గల్‌లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలి పారు. కూకట్‌పల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్‌లో స్థలపరి శీలన చేశామని త్వరలోనే పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసిన సేవలను అందిస్తామన్నా రు. ఖమ్మం, హైదరాబాద్‌లో రెండు సెంటర్ల ఏర్పా టుకు స్థలపరిశీలన చేస్తున్నామని త్వరలోనే అవి కూడ ప్రారంభిస్తామని తెలిపారు. అదే విధంగా ఓల్డ్ సిటీలో సైతం ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వెల్‌నెస్ సెంటర్ల ద్వారా అన్ని రకాల వైద్యసేవలను అందిస్తామని, అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయని, జిల్లా కేంద్రం లోని ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సీటి స్కానింగ్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీం, జర్నలి స్టుల హెల్త్‌స్కీం పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన సీఈఒను నియమిస్తున్నట్లు తెలి పారు. జర్నలిస్టులకు ఇప్పటికే హెల్త్‌కార్డులను అందించడం జరిగిందని, అక్రిడేషన్ కార్డులున్న ప్రతి ఒక్క జర్నలిస్టును హెల్త్‌స్కీంలో చేర్చడం జరిగిందని, మిగిలిన వారికి కూడ సంబంధిత శాఖ అధికారులతో సంప్రదించి సమాచారం తెప్పించుకుని హెల్త్‌కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఎంప్లాయిస్, జర్నలిస్టుల హెల్త్‌స్కీం ద్వారా ఇప్పటికే లక్ష మందికి పైగా వైద్య సేవలు అందించామని తెలిపారు. ఈ స్కీం ద్వారా వైద్య సేవలు పొందిన వారు చాలా సంతోషంగా ఉన్నారని, దేశంలో ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఇలాంటి వైద్య సౌకర్యం కల్పించలేదని, తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని అమలు చేస్తుందన్నారు.

Comments

comments