Search
Tuesday 19 June 2018
  • :
  • :

ఉచిత చికిత్స కోసం వెల్‌నెస్ సెంటర్లు

LAXMA-REDDY

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల, పాత్రికేయులకు ఉచిత వైద్య చికిత్స అందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా 14 వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ఎంతో మంది చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ సెంటర్ల ద్వారా అన్ని రకాల వైద్యం అందిస్తున్నామన్నారు. పాతబస్తీలో కూడా వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే మరిన్ని వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

Wellness Centers for free Treatment

Comments

comments