Search
Friday 20 April 2018
  • :
  • :

కొత్తకోట గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యేనా..?

kkt

*పాత పోలీస్‌స్టేషన్ స్థలంలో
 పందుల స్తైరవిహారం
* మూత్రశాలలకు నిలయంగా మారిన వైనం

కొత్తకోట:పట్టణంలోని చౌరస్తా లోగల పాత పోలీస్‌స్టేషన్ స్థలంలో నిర్మాణం పూర్తి అవుతుందా అని ప్రజలు ఆరోపిస్తున్నారు. దాదాపు 14 పాతపోలీస్‌స్టేషన్ స్థలం వృథాగా ఎలాంటి మరమ్మతులు లేకుండా వృథాగా ఉండడం పట్ల గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం లేకపోయిందని పలు వురు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీస్‌స్టేషన్ ఖాళీ చేసి నూతన పోలీస్ స్టేషన్‌లో కి వెళ్లినప్పటికి గ్రామ పంచాయతీ, పోలీస్‌శాఖల మధ్య వివాదం నెలకొంది. కోర్టులో తీర్పుతో గ్రామ పంచాయతీకి ఈ స్థలం దక్కింది. నాటి నేటి వరకు పనులు వేగవంతం కాకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సర్పం చ్ చెన్నకేశవరెడ్డి హయాంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్మాణం చేసి గ్రామ పంచాయతీకి ఆదాయం పెంచేందుకు ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపి జితేందర్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావును పాత పోలీస్ స్టేషన్ స్థలాన్ని చూపించి గ్రామ పంచాయతీ నిర్మాణానికి ఈ స్థలంను కృషి చేయడం జరిగింది . ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు కాకపోవడంతో కొన్ని రోజులుగా పను లు ముందుకు సాగడం లేదు. రాకపోకలు సాగించే పాదాచారులకు పందుల నివాసాలుగా ఈ స్థలం ఏర్పడింది. దీన్ని గమనించిన సర్పంచ్ ,పాలకమండలి గ్రామ పంచాయతీ నిధుల నుండి పాతపోలీస్ స్టేషన్ భవనాన్ని కూల్చి పనులను ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. పనులు ముందుకు సాగక పోవడంతో సర్పంచ్ చెన్నకేశవరెడ్డి గ్రామ పంచాయతీ పనులు ప్రారంభించేందుకు తేదీలను ముహూర్తానికి ఖరారు చేశారు.
పనులు వాయిదా పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.. గ్రామ పంచాయతీ కార్యాలయం కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే చిరస్థాయిలో పాలక మండలి ,అధికారులు చరిత్రలో నిలుస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు.. కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లైతే గ్రామ పంచాయతీకి లక్షల్లో ఆదాయం వస్తుందని పలు వురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments