Search
Sunday 21 January 2018
  • :
  • :
Latest News

భర్త వేధింపులతో మహిళ ఆత్మాహుతి

Fire-image

మన తెలంగాణ/హాలియా: భర్త వేధింపులతో మహిళ సజీవ దహనమైన ఘటన కొత్తపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇరిగి సునీత (28) 12 సంవత్సరాల క్రితం మండల పరిధిలోని చల్మారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఇరిగి రామయ్యకు తిరుమల మండలం బోయగూడెం గ్రామానికి చెందిన సునీతతో వివాహం జరిగింది. కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. శనివారం ఉదయం భర్త రామయ్యతో గొడవ జరగడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోవడంతో పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు నిప్పంటుకొని ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగి ఇంటితో పాటు ఆమె కాలిబూడిదయింది. స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు స్పందించి హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మృతురాలి అన్న బోలేపల్లి దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్సై సత్తీష్‌కుమార్ తెలిపారు. సంఘటన స్థలానికి అనుముల తహశీల్దార్ కెసి ప్రమీల చేరుకొని జరిగిన వివరాలను ఆరా తీశారు. అనంతరం సునీత పిల్లలకు రూ.4 వేలు, 20 కేజీల బియ్యాన్ని అందజేశారు.

Comments

comments