Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

భారీగా తగ్గిన ‘రెడ్‌మి నోట్ 4’ ధర

Xiaomi-Redmi-Note-4ముంబయి: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమికి చెందిన రెడ్‌మి నోట్ 4 ధరను ఇండియాలో రూ. 1000 తగ్గించింది. దీంతో రెడ్‌మి నోట్ 4 ధర భారత్‌లో రూ. 9999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు షావోమి ఇండియా డైరెక్టర్ మను కుమార్ సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న రెడ్‌మి నోట్ 4లో 3జిబి రామ్, 32జిబి స్టోరేజ్ గల మొబైల్ రూ. 9,999కు లభించనుంది. అలాగే 4జిబి రామ్, 64జిబి స్టోరేజ్ గల మొబైల్ రూ. 11,999కు దొరుకుతుంది.

రెడ్‌మి నోట్ 4 ఫీచర్లు…
5.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డి తాకేతెర(1080×1920 పిక్సెల్ రిజొల్యుషన్)
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
128బిజి వరకు మెమరీ విస్తరించుకునే సదుపాయం
13 ఎంపి బ్యాక్ కెమెరా
5 ఎంపి ఫ్రంట్ కెమెరా
4100 ఎంఎహెచ్ బ్యాటరీ
4జి విత్ విఒఎల్‌టిఇ, జిపిఎస్,  బ్లుటూత్, వైఫై.

Comments

comments