Search
Saturday 25 November 2017
  • :
  • :
Latest News

రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

Road-Accident

మన తెలంగాణ/పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన సంఘటనపట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలాఉన్నాయి. పట్టణ పరిధి బొల్లోరిగూడేనికిచెందిన భూక్యా రేవంత్ (26) ద్విచక్రవాహనంపై స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచికెయస్‌పి రోడ్ మీదుగా నట్రాజ్‌సెంటర్ వైపువస్తున్నాడు. ద్విచక్రవాహనం రోడ్డు చివరకువెళ్లి అదుపుతప్పి క్రిందపడటంతో రేవంత్ రోడ్డుపైపడిపోయాడు.

అదేవైపుగా వెళ్తున్న యాష్ టాంకర్రేవంత్ తలపై నుండి వెళ్ళడంతో తలభాగం చిద్రమయిఅక్కడిక్కడే మృతిచెందాడు. ప్రమాదం హృదయవిదారకంగా ఉండటంతో సంఘటన ప్రాంతంలో భారీగా జనం గుమిగూడారు. రేవంత్‌కు ఐదునెలల క్రితమే శ్రీసత్యతో వివాహమయ్యింది. ఇంజనీరింగ్ పూర్తిచేసినరేవంత్ ఉద్యోగాలవేటలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా వైద్యశాలకుతరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు…ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలుమిన్నంటాయి. ప్ళ్ళైన 5 నెలలకే రేవంత్మృతిచెండంతో బంధువలఆర్ధనాధాలతో ఆసుపత్రి ప్రాంగణం మారుమ్రోగింది.

రేవంత్ తండ్రి శంకర్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్‌గాపనిచేస్తుండటంతో అటవీశాఖలోనే కాక శంకర్‌కినలుగురిలో మంచి పేరు ఉండటంతో అతని కొడుకుమృతి వార్త విన్న సన్నిహితులు అధికసంఖ్యలో ప్రభుత్వవైద్యశాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇద్దరుకుమారుల్లో పెద్దకుమారుడు మృతిచెందడంతో తండ్రినిఓదార్చడం ఎవరి తరం కాలేదు. చేతికొచ్చిన కొడుకుమృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదచాయలుఅలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. రేవంత్ అందరితో సన్నిహితంగా ఉండటంతో చాలామంది యువకులు ఆసుపత్రి వద్ద బారులు తీరారు.

Comments

comments