Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

యువతకు ఉపాధితోనే అభివృద్ధి

kdrm

30న హైదరాబాద్‌లో కొలువుల కొట్లాట సభ : కోదండరామ్
యాదాద్రి : యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినపుడే సమాజభివృద్ధి సాధ్యమవుతుందని టిజెఎసి చైర్మన్ ప్రొపెసర్ కోదండరామ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు అధికార పాలన పూర్తి చేసుకుంటున్న పాలకులు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్షం వహించారని, యువతకు ఉద్యోగం కావాలని టిజెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కొలువులపై కొట్లాట కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. 30న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో జరుగు కొలువులపై కొట్లాట సభను జయప్రదం చేయాలని అందులో భాగంగానే రాష్త్ర వ్యాప్తంగా సన్నాహ సమావేశాలు చేపట్టడం జరిగిందని యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీర్వాదం తోనే శుక్రవారం సమావేశానికి శ్రీకారం చుట్టామన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ మాటలతో పబ్బం గడుపుతుందని, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని గొప్పలు చెప్పిన కేసిఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. టిజెఎసి చేపట్టిని కొలువుల కొట్లాట సభకు సిపిఐ మద్దతు తెలుపుతుందని అన్నారు. సమావేశంలో మద్దతుగా కాంగ్రెస్ నాయకులు బీర్ల అయిలయ్య, న్యూ డెమెక్రసీ నాయకులు బేజాడి కుమార్, టిజెఎసి నాయకులు పూస శ్రీనివాస్, అచ్చయ్య, సాంబేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని టిజెఎసి చైk్మన్ కోదండరామ్ దర్శించుకున్నారు. యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన కార్యకర్తలతో కలిసి లక్ష్మి నరసింహుని దర్శించుకోగా ఆలయ అర్చకులు స్వామి వారి ఆశ్వీరచనం తీర్ధ ప్రసాదాలను అందచేశారు.

Comments

comments