Search
Sunday 27 May 2018
  • :
  • :

పోలీసుల అదుపులో దళనేత గోపన్న?

మానుకోటలో ఓ ఇంటిలో ఉండగా అరెస్ట్

  Gopanna

మనతెలంగాణ/ మహబూబాబాద్ టౌన్ : మానుకోట పోలీసుల అదుపులో న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళకమాండర్ జి.గోపన్న ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మానుకోట జిల్లా కేంద్రంలోని రాహుల్ కాలనీలో ఓ ఇంటిలో బస చేసిన గోపన్నను పోలీసులు అరెస్టు చేసి గోప్యంగా ఉంచినట్లు సమాచారం. జిల్లాలో వరుసగా రాయల వర్గానికి చెందిన దళనాయకులు అరెస్టుల పర్వం కొన సాగుతునే వుంది.

గతంలో కొత్తగూడ ,పాకాల అడవులలో శ్యాం ఆలియాస్ జంపన్న, గార్ల సమీపంలో ఆవునూరి మధుతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన విషయం జిల్లా ప్రజలు మరువక ముందే గోపన్న అరెస్టుతో ఒక్కసారిగా పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. మానుకోట జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామానికి చెందిన దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్న ప్రస్తుతం మానుకోట జిల్లాలో రాయల వర్గానికి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మానుకోట జిల్లా కేంద్రంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గోపన్న కుటుంబంతో సహా ఉంటున్నట్లు సమాచారం అందడంతో అరెస్టు చేసినట్లు సమాచారం.

Comments

comments