Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్ మెట్రో ప్రయాణీకులకు శుభవార్త

Hyderabad-Metro-Rail--Smart-Card---Token-rules--1512193169-1400

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ ప్రయాణీకులకు అధికారులు ఓ శుభవార్త అందించారు. మెట్రో స్మార్ట్‌కార్డు తీసుకున్న ప్రయాణికులకు 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హైదరాబాద్ మెట్రోరైల్ అధికారులు సూచించారు. 10 శాతం డిస్కౌంట్‌తో పాటు పేటీఎం వినియోగదారులకు క్యాష్‌బ్యాక్ సదుపాయం కూడా ఉంది. వంద రూపాయాల రిచార్జ్ చేసిన వారికి రూ.20 క్యాష్‌బ్యాక్ వస్తుంది. స్మార్ట్ కార్డులను మెట్రో స్టేషన్ల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ప్రయాణికులు సుమారు లక్ష 50వేల మెట్రో స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేసినట్లు మెట్రో అధికారులు వెల్లడించారు.

10 Percent Discount on Hyderabad Metro Rail Smart Card.

Comments

comments