Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

పసిపాపకు ప్రాణం పోసిన 108 సిబ్బంది

108-Emergency-Service

వికారాబాద్: 108 సిబ్బంది చాకచక్యంతో ప్రాణం పోయిందనుకున్న పసిగుడ్డు బతికింది. పసిపాపకు 108 సిబ్బంది ప్రాణం పోసిన సంఘటన శుక్రవారం కొడంగల్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే గర్భిణీ గోరిబాయికి పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కి సమాచారం అందించారు. దీంతో 108 వాహనం వెంటనే అక్కడికి చేరుకుంది. అయితే 108లో ఆస్పత్రికి తరలించేలోపే అంబులెన్స్‌లోనే గోరిబాయి పాపకు జన్మనిచ్చింది. కాగా, పాపలో ఎలాంటి చలనం కనిపించకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. దాంతో వెంటనే స్పందించిన 108 సిబ్బంది నియోనేటల్ రెస్పిరేషన్ ప్రక్రియ ద్వారా పాపకు ఆక్సీజన్ అందించారు. సిబ్బంది చికిత్సతో పాపలో కదలిక వచ్చింది. దాంతో పాపను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

108 Crew members Rescued a New Born Baby.

Comments

comments