Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

మనకు ఒకే కొత్త ఏడాది వేడుక… కానీ వాళ్లకు 16

NASA

వాషింగ్టన్: ప్రపంచం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. డిసెంబర్-31 అర్ధరాత్రి 12 దాటగానే నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని తాకుతాయి. న్యూయర్ వేడుకలను మనం ఒకసారి జరుపుకోవడానికి మాత్రమే వీలుంటుంది. కొందరు మాత్రం 16 సార్లు  జరుపుకుంటారు. కొత్త సంవత్సరం వేడుకలు 16 సార్లు జరుపుకోవడం ఏంటి అనుమానం వస్తుంది కదా మీకు… అంతర్జాతీయ వ్యోమగాములు 16 సార్లు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారు. మన భూమి చుట్టూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ఒకటి తిరుగుతుంది. ప్రతి 90 నిమిషాల కొకసారి ఐఎస్ఎస్ భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. ఒకే రోజు లో 16 సార్లు భూమి చుట్టు తిరుగుతుంది. ఒకే రోజులో  వ్యోమగాములు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు వీక్షిస్తారు. ఈ ఐఎస్ఎస్ లో ఆరుగురు వ్యొమగాములు ఉంటారు. ఇందులో ముగ్గురు అమెరికన్లు, ఇద్దరు రష్యన్స్, ఒకరు జపానీస్ ఉంటారు.

Comments

comments