Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

విరాట్ కోహ్లికి రెండో ర్యాంకు

kohli
 ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్

దుబాయి: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారించిన కోహ్లి ఏకంగా రెండో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లి 610 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అతనికి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు కూడా దక్కింది. ఇప్పటికే వన్డేలు, ట్వంటీ20 బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం విదితమే. తాజాగా కోహ్లి టెస్టుల్లో కూడా టాప్ ర్యాంక్‌కు అడుగు దూరంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో మెరుపులు మెరిపిస్తే టెస్టుల్లో కూడా అగ్రస్థానాన్ని దక్కించుకోవడం కష్టం కాకపోవచ్చు. కోహ్లి ప్రస్తుతం 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సిరీస్ ప్రారంభానికి ముందు కోహ్లి ఆరో స్థానంలో కొనసాగాడు. కాగా, ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ 938 రేటింగ్ పాయింట్లతో టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో నిలకడగా రాణించడం ద్వారా స్మిత్ టాప్ ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. కాగా, భారత స్టార్ చటేశ్వర్ పుజారా 873 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. లంక సిరీస్‌లో పుజారా కూడా మెరుగైన ఆటను కనబరిచాడు. దీంతో అతను టాప్5లో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ 879 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో నిలిచాడు. యాషెస్ సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో రెండో ర్యాంక్ కోసం అతను భారత కెప్టెన్ కోహ్లి రేసులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత వీరి ర్యాంకింగ్స్‌లో మార్పులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాగా, టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.

Comments

comments