Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

టిఎస్‌ఎస్పిడిసిఎల్‌లో 3వేల పోస్టులు

tg
హైదరాబాద్: నిరుద్యోగులకు మరో శుభవార్త అందించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ(ట్రాన్స్‌కో)లో 1604 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టిఎస్‌ఎస్పిడిసిఎల్)లో మరో 3వేలకు పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని సిఎండి రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనులు జారీ చేస్తామని, రానున్న పది రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చని అయన పేర్కొన్నారు. ఇందులో 15 అసెస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జెఎఒ), 2000 జూనియర్ లైన్‌మెన్(జెఎల్‌ఎం) పోస్టులు ఉండనున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులు ఉండనున్నాయి.

Comments

comments