Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

వాహనం బోల్తా.. నలుగురు దుర్మరణం

Vehicle-in-fell-off-a-cliff

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని తీన్ ధరాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తైన కొండ ప్రాంతంపై నుంచి వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

4 dead the vehicle in fell off a cliff in Uttarakhand.

Comments

comments