Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టి వేత

rise
రెండువాహనాలు,50క్వింటాళ్ల బియ్యం సీజ్
మల్హర్:రెండు అటో ట్రాలీలల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బుధవారం తెల్లవారు జామున కొయ్యూరు పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం టిఎస్ 03యుబి2553,ఎపి 15టిబి 9193 నెంబరు గల రెండు వాహనాల్లో కావటి రాజు,జువ్వాక మహేష్ లు సుమారు యాబై క్వింటాల్ల రేషన్ బియ్యం వర్కు సంచుల్లో నింపుకొని పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారం మండలం ఒడేడు గ్రామం నుండి వయా ఖమ్మంపల్లి తాడిచెర్ల,కొయ్యూరు నుండి మహారాష్ట్ర లోని చిరొంచ కు తరలిస్తుండగా కాటారం సిఐ శంకర్‌రెడ్డి,కొయ్యూరు ఎస్సై బెల్లపు స్వామి ఆద్వర్యంలో కొయ్యూరు వద్ద పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారన జరిపి సివిల్ సప్లయ్ అధికారులుకు అప్పగించ నున్నట్లు వారుతెలిపారు.ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బేగ్,హఫీజ్,రమేష్,లక్ష్మన్‌లు పాల్గోన్నారు.

Comments

comments