Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న కారు

car
-మగ్గురికి తీవ్రగాయాలు
మనతెలంగాణ/ఇల్లంతకుంట
ఇల్లంతకుంట మండల కందికట్కూర్, పాండలపురం సమీపంలో కారు ద్విచక్రవాహనం(స్కూటి)మంగళవారం ఢీ కొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన యాస మాణిక్యం తన భార్య భారతితో కలసి పిల్లలు పండు, చిట్టిలను తన స్కూటిపై తీసుకుని కరీంనగర్‌కు వెళ్తున్నాడు. అదే రహదారిలో సిద్దిపేటకు చెందిన ఓ కారు ఎదురుగా వస్తుంది. దీంతో వీరి వాహనం పైకి ఒక్కసారిగా దూసుకవచ్చి వేగంతో ఢీ కొంది. ద్విచక్రవాహనం నడుపుతున్న మాణిక్యానికి, కుమారుడు పండుకి (10)తీవ్రగాయాలయ్యాయి. భార్య భారతికి తలకు బలంగా గాయమైంది. దీంతో ముగ్గురిని కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ పాకాల లకా్ష్మరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ధర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments