Search
Sunday 27 May 2018
  • :
  • :

ప్రజల కోరిక మేరకే డబుల్ రోడ్డు నిర్మాణం

sit

మన తెలంగాణ/సంస్థాన్‌నారాయణపురం: ప్రజల కోరిక మేరకే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. మంగళవారం నారాయణపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులపై అఖిల పక్షం నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజల రాకపోకలు, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. రోడ్డు విస్తరణలో నష్టపోతున్న వారికి చేయూతనందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని  కోరారు. మండల కేంద్రంలో ఆధునిక పద్ధతులతో గ్రామపంచాయతీ నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. గ్రామాభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.  ఈ సమావేశంలో మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడుతుండడం వల్ల కొంత మంది ఇళ్లు దెబ్బతింటున్నాయని, వారికి నష్టపరిహారం అందించే విధంగా చూడాలని పలువురు ఎమ్మెల్సీని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏర్పుల అంజమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు వడ్డెపల్లి గోపమ్మ, అఖిల పక్షం నాయకులు బద్దుల కృష్ణయ్య, ఎండి.నయీం షరీఫ్, మందుగుల బాలకృష్ణ, ఏపూరి సతీష్, బచ్చనగోని గాలయ్య, వీరమల్ల యాదయ్య, దోనూరు వీరారెడ్డి, సూరపల్లి శివాజీ, వంగరి రఘు, శికిలమెట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments