Search
Friday 20 April 2018
  • :
  • :

 నీటి డ్రమ్ము లో పడి మృతి చెందిన బాలిక

baby2
నేలకొండపల్లి
మండలంలోని మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు నీటి డ్రమ్ములో పడి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బోదులబండకు చెందిన నరసింహారావు-లావణ్య దంపతులు నేలకొండపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి కుమార్తె మేఘన(9)గురువారం ఇంట్లో ఉన్నడ్రమ్ములో నీళ్లను ముంచుకునేందుకు డ్రమ్ములోకి వంగింది. అంతే ప్రమాదవశాత్తు డ్రమ్ములో పడిపోయింది. కొద్ధి సేపటికి తల్లిదండ్రులు చూసే సరికి బాలిక డ్రమ్మలో పడి ఉండటంతో చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే నేలకొండపల్లి ఆసుపత్రి కి తీసుకరాగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.

Comments

comments