Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఫీ పెంపు పట్ల నిరసన

student

చైతన్య భారతి కాలేజీ విద్యార్థుల బైఠాయింపు
చెప్పిన దానికి విరుద్ధంగా విపరీతంగా ఫీజు పెంచారంటూ నిరసన
యాజమాన్యంతో చర్చలు విఫలం, 9న మళ్లీ భేటీ

హైదరాబాద్/నార్సింగి : గండిపేట సిబిఐటి (చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కళాశాలలో పెంచిన ఫీజులను తగ్గించాలంటూ బుధవారం రెండవ సంవత్సరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్లపై బైఠాయించారు. సిబిఐటి కళాశాలలో చేరేటప్పుడు మూడు సంవత్సరాల తరువాత ఫీజులు పెరుగుతాయని చెప్పిన యాజమాన్యం, ప్రస్తుతం రెండవ సంవత్సరంలోనే అధిక మొత్తంలో ఫీజులు పెంచడానికి నిరసనగా విద్యార్థులు రోడ్లపై బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు నార్సింగి సిఐ రమణగౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రిన్స్‌పాల్ సుభాష్ 50 మంది విద్యార్థులతో జరిపిన చర్చలు ఫలించలేదు. ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఫీజులు పెంచడం అక్రమమని విద్యార్థులు నిలదీశారు. ఒక నెల ముందే నోటీసులు ఇచ్చామని ప్రిన్స్‌పల్ సుభాష్ తెలిపారు. రెండు రోజుల ముందు నోటీసు లు ఇచ్చి ఫీజులు పెంచడం సరికాదని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. 9వ తేదీన కళాశాల యాజమాన్యంతో సమావేశం జరుగుతుంది కనుక విద్యార్థులు సామరస్య పూర్వకంగా సమస్య ను పరిష్కరించుకోవాలని సిఐ కోరడంతో విద్యార్థులు శాంతించా రు. ఫీజులు తగ్గించకపోతే మళ్లీ ధర్నాలు చేస్తామని హెచ్చరించారు.

Comments

comments