Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

ఏడు ఎండ్ల బాలికను కిడ్నాప్, అత్యాచారం చేసి హత్యచేసిన దుండగలు

baby
మనతెలంగాణ/రేగొండః జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లిలో దారుణం జరిగింది. అభంశుభం తేలియని చిన్నారి బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన అనంతరం అగంతకులు హత్యచేసిన చేసిన ఘటన సోమవారం వెలుగుచూసింది. తల్లి దండ్రులు,గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…. గ్రామానికి చెందిన ఈర్ల రవి—ప్రవళిక దంపతుల కూతురు రేష్మ(7) అనే బాలిక ఆదివారం రాత్రి గ్రామంలో జరిగిన ఏమ్మార్పీయస్ నాయకురాలు భారతి మృతికి సంతాపకంగా స్మారకార్థం డిజేల సౌండ్‌లు పెట్టి కొవ్వత్తుల ర్యాలీనిర్వహిస్తుండగా ఇంట్లో అన్నం తింటున్న బాలిక చూసేందుకు వెళ్లిన బాలికను గుర్తు తెలియని వ్యక్తులు ముక్కుపచ్చలులారని బాలికను కిడ్నాప్ చేసిన మానవ మృగాలు మానవత్వం మరిచి కల్లుమూసుకుపోయి అత్యాచారానికి ఒడిగట్టిన దుండగులు బాలికను అత్యచేశారు. గ్రామంలో పోలిసులు విచారణ చేపట్టగా సాయంత్రం 4గంటల సమయంలో ఎస్సీ కాలనీ సమీపంలోని వరి పోలంలోని గడ్డికుప్పల్లో బాలిక శవం కనిపించింది. ఈ విషయాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి చూసిన తల్లి దండ్రులకు రేష్మ మృతి చెంది ఉండడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి వారు ఏడుస్తున్న తీరును అక్కడున్నవారు ఏవరుకూడ ఆపలేకపోయారు. అగంతకులు చేసిన ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు త్వరగతిన నిందితులను గుర్తించి శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఘటన తీరుపై పోలిసులు తనదైన శైలిలో విచారణ చేస్తున్నారు. గ్రామానికి చెందిన వ్యక్తులేనా….అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను ఆదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని భూపాలపల్లి రాజేంద్ర మహేంద్ర నాయక్,చిట్యాల సీఐ గండ్రాతి మోహన్,స్థానిక ఇంచార్జీ ఎస్సై స్వామి పరిశీలించి స్థానిక పోలిసులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పుట్టిన రోజే శవమైంది
సోమవారం రేష్మపుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు తల్లితో కలిసి పరకాలకు వెళ్లి కొత్త బట్టలు స్వీట్సు,కేక్‌ను కొనుగోలు చేసుకొని సంబురంగా ఇంటికి చేరుకుంది. సాయంత్రం పనిముగించుకొని ఇంటికి వచ్చిన తండ్రితో బట్టులు తెచ్చిన విషయం చెప్పి సంతోషం వ్యక్తం చేసింది. అంతలోనే మాయమై మృగాల చేతిలో నలిగిపోయి పుట్టిన రోజు జరుపుకోవాల్సిన ఆ చిన్నారి బాలిక శవమై తేలడంతో కుటుంబ సభ్యులు,గ్రామస్తులు మృత్యుసాగరంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టక తప్పలేదు. బాలిక రేష్మ మృతితో గొరికొత్తపల్లిలో విషాద చాయలు అలుముకున్నాయి.

 

Comments

comments