Search
Monday 11 December 2017
  • :
  • :
Latest News

దేశ రాజధానిలో స్వల్ప భూకంపం

delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిలీలో భూకంపం సంభంవించింది. బుధవారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీలలో సంభవించిన భూకంప తీవ్రత దేశ రాజధానిని తాకింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5గా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. డెహ్రాడూన్‌కు 121 కి.మిల దూరంలో భూకంప కేంద్రంలో ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, హరిద్వార్, అల్మోరా, రామ్‌నగర్‌లో భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది.

Comments

comments