Search
Monday 18 June 2018
  • :
  • :
Latest News

తెలుగు భాష సంబరాలు కన్నులపండువగా నిర్వహించేందుకు చర్యలు

conference

మనతెలంగాణ/నిజామాబాద్‌బ్యూరో
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లాలో చేపట్టే జిల్లాస్థాయి సన్నాహాక తెలుగు భాష సంబరాలను కన్నుల పండుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని యువజన, క్రీడలు, టూరిజం, సాంస్కృతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. వెంకటేశం జిల్లా కలెక్టర్లను కోరారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిదారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, సిఎం ప్రత్యేక కార్యదర్శి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించే తెలుగు సంబంధాలు తెలంగాణ ఆవిర్భావ సందర్బంగా నిర్వహించే వేడుక లాగా ఘనంగా నిర్వహించాలని ప్రజలు అందరూ తెలుగు భాష పట్ల ఆసక్తి చూపించే విధంగా కార్యక్రమాలను ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలో పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో వివిధ పోటీలను నిర్వహించని వారు రేపటిలోగా పూర్తి చేయాలన్నారు. ఈ పోటీల్లో ప్రభుత్వ కళాశాలలకే కాకుండా ప్రైవేట్, ఎయిడెడ్, ఆన్ ఎయిడెడ్ పాఠశాలలకు కూడా అవకాశం కల్పించాలన్నారు. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్రస్థాయిలో పాల్గొనాలన్నారు. 9వ తేదీన డిగ్రీ స్థాయి,11వ తేదీ ఇంటర్మీడియట్, యూనివర్సిటీ స్థాయిలో 12వ తేదీన తెలుగు యూనివర్సిటీ ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల వరకు రావాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో తెలుగు భాషకు సంబంధించిన శాసనాలు ఇతర సంబంధించిన ఫోటోలు తీసి పంపించాలని కలెక్టర్లను కోరారు. తెలంగాణ భాషకు సంబంధించిన కవుల పేర్లు జిల్లా కేంద్రం నుండి కాగడాలను తీసుకొని హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి తీసుకొస్తే వెలిగించి తిరిగి పంపించేందుకు జిల్లాలను ఎంపిక చేసి పంపిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎ. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సన్నాహాక తెలుగు భాష సంబరాలను 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు ఘనంగా నిర్వహించామని కవులైన దశరథి, పంపన, కొరావి గోపరాజు కవులు స్మారకార్థం బోధన్, భీంగల్, నిజామాబాద్‌లో కవి సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. 7వ తేదీ ముగింపు సందర్బంగా తెలంగాణ జానపద కళారూపాలు, అధికారులు, విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. సావనీర్, విశిష్ట వ్యక్తులకు, కవులు, రచయితలకు సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సమాచార శాఖ డిడి మహ్మద్ ముక్తుజ, గ్రంథాలయ కార్యదర్శి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో…
ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 15 నుండి 19 వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సమావేశానికి అధిక సంఖ్యలో తెలుగు భాష కవులు, కళాకారులు పాల్గొనాలని సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడారు. జిల్లా స్థాయిలో ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న విశిష్ట రచయితలు, కవులు, సాహిత్యకారులు, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జిల్లా స్థాయిలో నిర్వహించినందున అందులో పాఠశాల, కళాశాల, డిగ్రీ, యూనివర్సిటీ, ఏయిడెడ్ కళాశాలలు విజేతలైన వారి పేర్లను ఈ నెల 10 , 11,12 తేదీలలో అందించాలన్నారు. హైద్రాబాద్‌లో నిర్వహించే ప్రపంచ తెలుగు మహా సభలకు సాహిత్య రంగంలో అభిరుచి ఉన్న మహిళా ఉద్యోగులను వోడిపైన పంపిం చాల్సిందిగా కోరారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా జిల్లాలో తెలుగు భాష వైభవాన్ని చాటేలా హస్త కళలు, చీరలు, పుస్తకాల ప్రదర్శన నిర్వహిం చాల న్నారు. ముఖ్య మంత్రి వోఎస్‌డి దేశ్‌పతి శ్రీనివాస్ మా ట్లాడుతూ ప్రపంచ మహాసభలు ఈ నెల 16న హైద్రాబాద్ ప్రియదర్శినిలో చిన్నారుల ప్రదర్శన, లళిత కళాతోరణంలో జానపద కవులచే కళలు, రవీంద్రభారతిలో సాంస్కృతిక ప్రదర్శన , ఎల్బీ స్టేడియంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ తాయన్నారు. ఆసక్తి గల వారు మహాసభలకు హాజరు కావాలని సూచించారు. తెలుగు సాహిత్య అకాడమిక్ చర్మన్ సిదారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషలో సైన్ బోర్డు ఉండేలా చైర్యలు తీసుకోవాలన్నారు. గ్రంథాలయ చైర్మన్ గంగాధర్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలలో జిల్లా స్థాయి గ్రంథాలయ కార్యదర్శులు పాల్గొనేలా చూడాలన్నారు. కలెక్టర్ చాంబర్‌లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో సంయుక్త కలెక్టర్ సత్తయ్య, డిఆర్వో మనిమాల, డిఈవో మధన్ మోహన్, డిపిఆర్వో పద్మ, డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ఫ్రొఫెసర్, తెలుగు భాష ఉపాధ్యాయులు , తదితరులు పాల్గొన్నారు.

Comments

comments