Search
Monday 22 January 2018
  • :
  • :
Latest News

సమ్మక్క సారక్క ఆలయ ట్రస్టుకు ఆదివాసీలే అర్హులు

adivasi

మన తెలంగాణ/నిర్మల్ అర్బన్ : భూపాలపల్లి జిల్లా మేడరంలో ఆదివాసీ తెగకు సంబంధించిన సమ్మక్క-సారక్క ఆలయ కమిటీలో ఆదివాసీ తెగ కానటువంటి వలస లంబాడీలను ఆలయ కమిటీ మెంబర్లుగా ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుం దెబ్బ పోరాట సమితి నాయకులు ప్రశ్నించారు. సమ్మక్క సారక్క ఆలయ ట్రష్టు పూర్తిగా ఆదివాసీ తెలగతో ఏర్పాటు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆదివాసీలపై లంబాడీ నాయకులు దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు. మంత్రి చెందిలాల్ కుమార్‌డు అజ్మీర ప్రహాళ్లాద్ నాయక్ ప్రభుత్వ అండదండలతో ఆదివాసులను అనిచివేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. ఇప్పటికైన కెసిఆర్ మౌనం వీడి వలస లంబాడీలను తొలగించాలన్నారు. సమ్మక్క- సారలమ్మ ఆలయ కమిటీ నుండి వలస లంబాడీలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కొమరం భీం విగ్రహానికి చెప్పుల మాల వేసి అవమాన పరిచిన వలస లంబాడీలను వెంటనే అరెస్టు చేసి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఇందులో ఆదివాసీ నాయక్‌పోడ్ రాష్ట్ర కార్యదర్శి తుడుం దెబ్బ నిర్మల్ జిల్లా అధ్యక్షులు వెంకగారి భూమయ్య, మొసలి చిన్నయ్య, మంద మల్లేష్, సుంకరి సాయన్న, సుంచు శ్రీనివాస్, భూసాని రాజేశ్వర్, సాయన్న, గోవర్థన్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments