Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

‘అజ్ఞాతవాసి’ టీజర్ అదిరిపోయిందంతే….

Pawan-Kalyan

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పిఎస్‌పికె 25 మూవీ ‘అజ్ఞాతవాసి’.  ఈ చిత్రం  టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.  పవన్ అభిమానుల ఎదురుచూపులకు తగ్గట్లుగానే టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చూస్తుంటే త్రివిక్రమ్, పవన్ కాంబో మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్ లో ‘వీడి చర్యలు ఊహాతీతం అన్నారు’ అని మురళీశర్మ అంటే ‘దట్‌ ఈజ్‌ ద బ్యూటీ’ అంటూ రావు రమేష్‌ చెప్పే డైలాగ్‌ బాగుంది. ఈ మూవీలో పవన్ కు జోడీగా కిర్తీ సురేష్, అను ఇమాన్యుయల్ నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రల్లో ఖుష్బూ, బోమన్ ఇరానీ, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. తమిళ కుర్రా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 19న ఆడియో విడుదల కానుంది. సంక్రాతి కానుకగా 2018 జనవరి 10న ఈ సినిమాని ప్రేక్షకులకు ముందుంచేందుకు చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది.

Agnyaathavaasi Official Teaser out now.

Comments

comments