Search
Friday 20 April 2018
  • :
  • :

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

aids2

మన తెలంగాణ/జనగామ ప్రతినిధి: ఎయిడ్స్‌వ్యాధిపై ప్రతిఒక్కరు అవ గాహన కలిగియుండాలని జనగామ కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి స్థానిక చౌరస్తా వరకు డాక్టర్లు, ఎఎన్‌ఎంలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎయి డ్స్‌పై ఆవగాహన కలిగియుండాలని, నేటి బాలలే రేపటిపౌరులన్నారు. ఎయిడ్స్ వ్యాధికి చికిత్స ముఖ్యమన్నారు. గర్భిణులు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవికి సంబంధించిన వాల్ పోస్టర్, సీడి, యాప్‌లను ఆవిష్కరించారు. మున్సిపల్, మార్కెట్, చైర్‌పర్సన్లు ప్రేమలతారెడ్డి, పద్మ, డిఎంహెచ్‌ఓ అన్నప్రసన్నకుమారి, డాక్టర్  లక్ష్మీనారా యణనాయక్, ప్రోగ్రాం ఆషీసర్ పద్మావతి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కన్నా పరుషరాములు, డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments