Search
Sunday 25 February 2018
  • :
  • :

ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్

Airtel Payment Bank offer

ముంబయి: రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. చౌకైన టారీఫ్‌లతో అనతికాలంలోనే జియో కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకుంది. దీంతో మిగతా టెలికాం ఆపరేటర్లు ఆత్మరక్షణలో పడ్డాయి. తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు రోజుకో కొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ మరో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కొరకు రూ. 199 రీఛార్‌పై 28 రోజుల పాటు రోజుకు 1జిబి (3జి/4జి) డేటాతో పాటు అపరిమిత లోకల్, ఎస్‌టిడి కాల్స్, అపరిమిత ఎస్‌ఎంఎస్ అందించనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కస్టమర్లతో పాటు కొత్త వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ముంబయి, కర్ణాటక, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ తదితర ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

Airtel Now Offers ‘Unlimited Calls’, 1GB Data for 28 Days at Rs. 199

Comments

comments