Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అన్ని మాతాల వారిని కలిపేది క్రీడలే

 

revantgh

*యువతలో క్రీడాస్ఫూర్తిని నింపాలి
*ఓటమిని గెలుపునకు పునాదిగా భావించాలి
*పిల్లలు చదువుతోనే ప్రాంత అభివృద్ధి ముఖ్యం
*ఎమ్మెల్యేలు రేవంత్, సంపత్

క్రీడాస్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందని జాతీయ హాకీ ఫెడరేషన్ అధ్యక్షులు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. కొడంగల్‌లో మంగళవారం నిర్వహించిన 63వ ఎస్‌జిఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పాత ఉమ్మడి జిల్లాల నుండి వచ్చిన అండర్-19క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జాతీయ క్రీడ అయిన హాకీ రాష్ట్ర స్థాయి పోటీలను మారుమూల ప్రాంతమైన కొడంగల్‌లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఆటలో గెలుపోటములు సాధారణమేనని, గెలిచిన వారికి మొత్తం వచ్చినట్లు కాదు… ఓడిన వారికి ఏమీ రానట్లు కాదని పేర్కొన్నారు. క్రీడాకారులు మైదానంలో ఉన్నప్పుడు శ్రద్ద, నిబ్బద్దత ఉన్నపుడే సరైన గుర్తింపు వస్తుందని సూచించారు. ఆటలతో క్రీడాకారులు దేశ, ప్రాంత గౌరవాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఆటల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్ స్కూల్స్‌ను ఏర్పాటు చేసి విధ్యార్ధులోన్ని నైపుణ్యాన్ని వెలికితియాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. మన కంటే గొప్ప వారిని స్పుర్తిగా తిసుకుని ముందుకు సాగలని సూచించారు. భవిష్యత్తులో ఓ ప్రాంతం అభివృధ్ధ చెందాలంటే పిల్లలు తప్పని సరిగా చదువుకోవాలని చెప్పారు. కార్యక్రమానికి హాజరైన అలంపూర్ శాసన సభ్యులు సంపత్‌కుమార్ మాట్లాడుతూ అభివృధ్దిని వెన్నకి నెట్టి, నిర్లక్షనికి గురైన ప్రాంతాలు కొడంగల్,అలంపూర్‌లన్నారు. ఇలాంటి వెనుకబడిన ప్రాంతంలో రెండవ సారి రాష్ట్ర స్ధాయి హాకి క్రీడలను నిర్వహించిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని కితాబిచ్చారు. శారిరక దృడత్వం,మానసిన ఉల్లాసం,పోటితత్వం క్రీడలతోనే సాద్యమౌతుందన్నారు. విధ్యర్ధులు చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారిస్తే స్పోర్ట్ కోటాలో మంచి అవకాశాలు లభిస్తాయని సూచించారు. కొడంగల్  ప్రాంత ప్రజల సౌకర్యార్ధం ప్రవేటుకు దిటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన,మైదానాలను తిర్చిదిద్దడం ఎంతో ప్రశంసనియమన్నారు. అలాగే వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని అభివృధ్దిలో అగ్రగామిగా నిలిపేందుకు రేవంత్ చేసిన కృషిని అయన కొనియాడారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వాలన చేసి వారు క్రీడలు ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర నలుములల నుండి పాల్గొన్న క్రీడకారులచే అతిధులు గౌరవ వందనం స్వికరించారు. ఈ సందర్భంగా చెపట్టిన మార్చ్ పాస్ట్ సభికులను అకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఇంటర్ విధ్యాధికారి శంకర్ నాయక్,ఎస్‌జిఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శిలు పాపిరెడ్డి,రాంచేందర్,సురేందర్‌రెడ్డి,కళాశాల ప్రిన్సిపల్ రమణి,ఎంపిటిసి సభ్యులు రాజేందర్,ఉప సర్పంచ్ గౌసన్‌తో పిడిలు, నాయకులు పాల్గొన్నారు.

Comments

comments