Search
Tuesday 12 December 2017
  • :
  • :
Latest News

30 లోగా జిల్లాలోని అన్ని గ్రామాలను ఒడిఎఫ్ గ్రామాలుగా ప్రకటిస్తాం

collector2

మనతెలంగాణ /కామారెడ్డి : డిసెంబర్ 30 లోగా కా మారెడ్డి జిల్లాను ఓడిఎఫ్ జిల్లాగా ప్రకటిస్తామని కలెక్ట ర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెడికల్ అసోసియేషన్ భవనంలో గ్రామీణాభివృద్ధ్ది స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్‌షాపుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 20లోపు అన్ని గ్రామాలలో ఒడిఎఫ్ పనులు పూర్తి అయ్యేలా సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు పనిచేయాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత అనేది ఒక్కరితో ముడిపడి ఉండదని ఇది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలను చైతన్యపరిచేందుకు గ్రామాలలో వాల్‌పెయింటింగ్స్ ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని అలసత్వం వహిస్తే సహించేదిలేదని హె చ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు 72 శాతం ప్రగతి సాధించామన్నారు.  323 గ్రామ పంచాయతీలకుగాను 166 గ్రామ పంచాయతీలను స్వచ్ఛ గ్రామాలుగా ప్రకటించామన్నారు. ఈ కార్యమ్రంలో పిడి చంద్రమోహన్‌రెడ్డి, డిపిఒ రాంలు, ఎపిడి మోహన్‌రావు, శ్రీనివాస్‌సింగ్, శంకర్ నాయక్, నారాయణ 90 గ్రామాలకు సంబంధించిన సర్పంచ్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments

comments