Search
Monday 23 April 2018
  • :
  • :

బహుజనుల చైతన్యం కోసమే అంబేడ్కర్ జాతర

show

మన తెలంగాణ/కల్వకుర్తి: దళిత బహుజనుల బాగుకోసం పూలే, అంబేడ్కర్‌లు ఎంతగానో సేవలు అందించారని అంబేద్కర్ జాతర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని అతిథిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ జాతర వాల్‌పోస్టర్‌ను విడుదల చే శారు. ఈసంధర్బంగా సుధాకర్ మాట్లాడుతూ దళితుల బహుజనులలో స్థితి గతుల్లో మార్పు తీసుకురావలనే లక్షంతో అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నా మన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్నిరంగాలలో వాటా కోసం అందరిని చైతన్యం చేసేందుకు పూలే, అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గత 18 సంవత్సరాలుగా అంబేద్కర్ జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి దళిత బహుజనుల మేధావులు,విద్యావంతులు రాజకీయ పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని పిలుపు నిచ్చారు. అదే విధంగా రాబోవు రోజుల్లో ప్రతి గ్రామంలో అంబేడ్కర్ జాతర కమిటి వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి ఉపాధ్య క్షుడు వీరస్వామి,కార్యదర్శి శంకర్, రాష్ట్ర నాయకులు వెంకటయ్య,కల్వకుర్తి జాతర అధ్యక్షులు మబ్బుసాయన్న, కార్యదర్శి విష్ణు,నాయకులు స్కైలాబ్, రామస్వామి, కానుగుల జంగయ్య, వెంకటయ్య, తాలూకా నాయకులు జగన్, శివ, ఎల్‌హెచ్‌పిఎస్ నాయకులు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments