Search
Sunday 27 May 2018
  • :
  • :

ఏజెన్సీ మండలల్లో అంబులెన్స్‌ల ఏర్పాట్లు

banner

*ఏజెన్సీ ప్రాంతాల్లో పారామెడికల్ పోస్టుల భర్తీ
*ఐటిడిఎ గిరిజన బాలికలకు ప్రత్యేక నర్సింగ్ కళాశాలలు
*రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరాచందులాల్

మనతెలంగాణ/భూపాలపల్లి ప్రతినిధి: గిరిజనులకు అత్యవసర వైద్య సదుపాయాలను అందించేందుకు వీలుగా ఏజెన్సీ ప్రాంతాల్లోని మండల కేంద్రాలన్నింటిలో ప్రత్యేకంగా అంబులెన్స్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి అజ్మీరాచందులాల్ వెల్లడించారు. మంగళవారం నగరంలోని రాష్ట్ర గిరిజనాభివృద్ధిశాఖ కార్యాలయంలో నిర్వహించిన గిరిజనుల సలహామండలి సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లోని మెడికల్, పారా మెడికల్ పోస్టులన్నింటిని భర్తీ చేయబోతున్నట్లు మంత్రి వివరించా రు. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, మున్ననూరు ఐటిడిఎల్లో గిరిజన బాలికలకు ప్రత్యేక నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గిరిజన అనాథలు, నిరాశ్రయ మహిళలను ఆదుకునేందుకు ఐటిడిఎ కేంద్రాల్లో స్టేట్ హోంలను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పసిపిల్లల విక్రయాలను, మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేకం గా నిఘా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంతో అనుసంధా నం చేసుకుంటూ రూ.517కోట్లతో తండాలు, గూడాలకు రోడ్లను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. ఏజెన్సీప్రాంతాల్లోని గిరిజనులకు గొర్రెల, చేపల పెంపకం యూనిట్లను అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అడవుల్లో సుదూర ప్రాం తాల్లో ఉన్న చెంచు ఆవాసాలకు బిటి రోడ్ల సౌకర్యాన్ని కల్పించబోతున్నామని మంత్రి తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గిరిజన బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని ఆయా శాఖ కార్యదర్శులను మంత్రి ఆదేశించా రు. గిరిజన విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయ పోస్టులను శాశ్వతంగా భర్తీ చేసేలోగా విద్యావాలంటీర్లను నియమించుకోవాలని మంత్రి సంబంధిత అధికారులకు ఆదేశించారు. గిరిజన తండాలు, గూడాలను అనుసంధానం చేస్తూ నిర్మిస్తున్న రోడ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన సలహా మండలి సమావేశాలకు పలుశాఖల అధికారులు గైర్హాజరైనందున సమావేశాన్ని వాయిదా వేయాలని పలువురు సలహామండలి సభ్యులు కోరడంతో, సభ్యుల సలహా మేరకు సమావేశాన్ని కుదిస్తున్నామని మంత్రి తె లిపారు. గిరిజన సలహా మండలి సమావేశానికి వివిధ శాఖల అధికారులు డుమ్మా కొట్టడం పట్ల మంత్రి ఒకింత ఆగ్ర హం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మన్, ప్రభుత్వకార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ కె.లక్ష్మన్, పార్లమెంటు సభ్యులు సీతారాంనాయక్, శాసనసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments