Search
Friday 20 April 2018
  • :
  • :

అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు

rtc

* ఈనెల 15నుంచి 19వరకు
నిర్వహించే ప్రపంచ తెలుగు
మహాసభలకు తరలిన జిల్లా
సాహిత్య ప్రముఖులు,కవులు

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి:ఈనెల 22,23 తేదీల్లో శ్రీరంగాపురం లో తెలుగు సాహిత్య సాం స్కృతిక ఉత్సవాలు -2017నుఘనంగా నిర్వహిం చనున్నట్లు కలెక్టర్ శ్వేతామహంతి తెలిపారు. ఈ ఉత్సవాల్లో తెలుగు సాహిత్యంతోపాటుజానపద కళలు, ఇతర కళా ప్రదర్శనలను ఏర్పాటుచేయను న్నట్లు చెప్పారు. శుక్రవారం ఆమె కలెక్టర్‌కార్యాల య సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన కవు లు, సాహితీవేత్తలతో సమావేశమయ్యారు.ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ప్రపంచ తె లుగు మహాసభల సందర్భంగాపాఠశాల, కళాశా ల స్థాయిల్లో పోటీల నిర్వహణ,కవి సమ్మేళనం వంటివి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈనెల 15,16 న జిల్లా స్థాయిలోప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలనుకున్నప్పటికి అదే సమయంలోరాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు ఉన్నం దున ఈనెల 22,23 తేదీలకు మార్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 22,23 తేదీల్లో శ్రీరంగాపురం లో నిర్వహించే తెలుగు సాహిత్యసాంస్కృతిక ఉ త్సవాలకు అందరు పెద్ద ఎత్తునతరలి రావాలని ఆమె కోరారు. జిల్లా ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తు న ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని జిల్లాలోని ప్రజలందరు ఈ ఉత్సవాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. అనం తరం కలెక్టర్ హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్నప్రపంచ తెలుగు మహాసభలకు ప్రతినిధులనుతీసుకువెళ్లి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.ప్రారంభ వేడుకలకు హాజరయ్యేందుకుగాను ప్రభుత్వం ఐ దుబస్సులను ఏర్పాటుచేయగా జిల్లా నుండి 250 మంది కవులు, పండితులు,భాషాభిమానులు హై ద్రాబాద్ తరలివెళ్లారు.అలాగే ఈనెల 19న నిర్వ హించే ముగింపువేడుకలకు కూడా బస్సులు ఏర్పా టు చేయడం జరిగింది. జెసి నిరంజన్‌రావు, డిఆర్ ఒ పి.చంద్రయ్య ,డిఇఒ సుశీందర్‌రావు, డిపిఆర్ ఒ వెంకటేశ్వర్లు,ఆర్‌టిసి డిఎం రామయ్య, ఆర్డీఒ చంద్రారెడ్డి,డిఆర్‌డిఒ గణేష్ పాల్గొన్నారు.

Comments

comments