Search
Tuesday 19 June 2018
  • :
  • :

అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధోల్

village

సంగారెడ్డి జిల్లా అంథోల్ నియోజకవర్గం జోగిపేట నగర పంచాయతీ అభివృద్ధి నేతల కారణంగా అటకెక్కింది. కావల్సిన నిధులు ప్రభుత్వం కల్పిస్తున్నా, ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లిస్తున్నా నేతలకు ప్రజల బాధలు పట్టడంలేదు. అంథోల్ శాసనసభ్యులు బాబూమోహన్ ఒకవైపు, పంచాయతీ పాలకవర్గం మరోవైపు లాగుతుండటం అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. నగర పంచాయతీగా రూపాంతరం చెందితే ఎన్నో సౌకర్యాలు ఒనగూరుతాయన్న ప్రజల ఆశలు అడియాశ లుగానే మిగిలిపోతున్నాయి. పంచాయతీ అభివృద్ధికి నోచుకోక పోవడానికి గల కారణాలు విశ్లేషిస్తూ “మనతెలంగాణ” జోగిపేట ప్రజల కోసం అందిస్తున్న  మూడవ కథనం….

మన తెలంగాణ/జోగిపేటటౌన్: నియోజకవర్గకేంద్రమైన ఆంధోల్ నాలుగు సంవత్స రాల క్రితం (2013) జోగిపేటలో కలుపుతూ 16 వార్డులున్న జోగిపేటలో అను సంధా నం చేశారు. కోటి రూపాయల నిధులున్నా ఈ నాలుగు వార్డులు అభివృద్ధికి నోచుకో వడంలేదు.  గ్రామపంచాయతీగా ఉన్న కాలంలోనే కాస్తో కూస్తో అభివృద్ధి పనులు జరి గేవని, నగర పంచాయతీగా మారిన తర్వాత అభివృద్ధి కనుచూపుమేరలో కని పించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెంచిన పన్నులను వసూలు చేయడంతో తీసు కుంటున్న  శ్రద్ధ, మురుగు కాలువల నిర్మాణం, రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలపై పాలకవర్గం స్పందించడంలేదన్న అభియోగాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధిపనులు చేపట్టడానికి నిధులున్నా ప్రతి పనికి శాసనసభ్యుడు మోకాలడ్డుతుంటే తామేవిధంగా  ముందుకు సాగగలమని పాలకవర్గం వాపోతోంది.  నిక్కచ్చిగా వ్యవహరించిన అధికా రులు బదిలీల వేటుకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. భగీరథ కోసం గల్లీగల్లీలో పనులు చేపట్టవలసి ఉందని, నూతంగా రోడ్లు నిర్మిస్తే తిరిగి వాటిని తవ్వవలసివస్తే లక్షలాది నిధులు వృధా అయినట్లేనని, ఆ పనులు పూర్తయిన పిదప పనులు చేపడతామని శాసనసభ్యుడు బాబుమోహన్  ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.  భగీరథ పనులు లేనిచోట్ల  అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డేమిటని పాలకవర్గం వాదిస్తోంది.  మొత్తంమీద అటు పాలకవర్గం ఇటు  శాసనసభ్యుడి వాదనల మధ్య కాలం గడిచిపోతోందే తప్ప  అభివృద్ధికి కాలం కలిసి రావడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్‌గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే…
(కౌన్సిలర్ ప్రదీప్‌గౌడ్, అందోలు గ్రామ మాజీ సర్పంచ్)
తాను సర్పంచ్‌గా ఉన్నప్పుడే అభివృద్ధి గ్రామంలో ఉంద ని, నగర పంచాయతీ ఏర్పడి దాదాపు నాలుగు సంవ త్సరాలు పూర్తి కావుస్తుందని, ఎక్కడ వేసిన గొంగడి అక్క డే అన్న చందంగా తయారైంది. ఈ నాలుగు సంవత్స రాల్లో కేవలం మేము చేసింది ఒక్కటే ఎల్‌ఈడీ లైట్లు మాత్ర మే ఏర్పాటు చేసాం. గ్రామంలో వంద శాతం మరుగు దొడ్లు నిర్మా ణం చేపట్టాం. దానికి సంబంధించి సుమారు 70శాతంకు పైగానే లబ్ధి దారులకు బిల్లులు రావాల్సిఉంది, కానీ ఇంతవరకు అందలేదు. గతంలో నిర్వ హిం చిన టెండర్‌లలో అవకతవకలు జరిగాయని, రీటెండర్ కూడా చేసాం. ఆన్‌లైన్ లో నిర్వహించిన టెండర్‌లను దక్కించుకున్న కాంట్రాక్టర్‌ను టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే అభివృద్దిపనులను అడ్డుకొవడం సరైందికాదు. వ్యక్తిగత విషయాలను అభివృద్ది పను లపై రుద్దడం మంచి పద్దతికాదు. అభివృద్ది విషయంలో పలుమార్లు మంత్రి హారీష్ రావును కలిసినా, ఏలాంటి ప్రయోజనం లేదు. అసలు పంచాయతీ అభి వృద్ధి కావాలంటే తము ఏవిధంగా సహాకారించాలన్న తము సిద్దంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, అందోలు మాజీ సర్పంచ్ ప్రదీప్‌గౌడ్ తెలిపారు.
మిషన్ భగీరథకు అందోలు అభివృద్ధికి ఏలాంటి సంబంధం లేదుః
(తొట్ల మమత కౌన్సిలర్)
తమ వార్డు పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల ముందు నుండి కంకర తేలిన రోడ్డు ఉంది. ఆ దారి నుండే విద్యా ర్థులు, ప్రజలు కాలి నడకన నరకాయతన అనుభవిస్తూ వెళ్తుంటారు. సీసీ రోడ్డు వేసెందకు నగర పంచాయతీలో తీర్మాణం చేశారు. ఇందుకు సంబంధించిన పనులకు గాను 16లక్షలతో నిర్మించేందుకు నగర పంచాయతీ ఆమోదం తేలిపింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మిషన్ భగీ రథఅనే పథకంఅడ్డుపెట్టుకోని, నిలిపివేశారు. అంతేకాకుండా డ్రైనేజ్ పనులకు కూడా నిధులు మంజూరు అయ్యాయి. వాటికి సంబంధించిన పనులు కూడా ఎమ్మెల్యే నిలిపివేశారు. పాలక వర్గం అందరు కలసి ఎమ్మెల్యే వద్దకు వెళ్ళితే మిషన్ భగీ రథ వస్తుంది కాద అంటూ కాలం గడేపేస్తున్నారు. మేము వార్డులల్లో తిరగాలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైన నగర పంచాయతీ అభివృద్ధికి అడ్డుకుంటుంది ఎమ్మెల్యేనే అని నగర పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తొట్ల మమత రామకృష్ణ అన్నారు.
మిషన్ భగీరథ వల్లే అభివృద్ధి నిలిచింది
( రాచకొండ భవానీ నాగరత్నం గౌడ్, టిఆర్‌ఎస్)
అందోలు గ్రామం అభివృద్ధి చేయాకపోవడానికి ప్రధాన కారణం మిషన్ భగీరథ అని చెప్పవచ్చు. ప్రస్తుతం గ్రామంలో లైట్లు మాత్రమే బిగించాం. మిషన్ భగీరథ పనులు పూర్తి కాగానే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే సూచిం చారు. కేవలం మిషన్ భగీరథ కోసమే అభివృద్ధి నిలిచి పోయింది. అంతేకానీ ఎమ్మెల్యేను బాద్యులం చేయడం సరైందికాదు.
దానేష్‌ః (అందోలు యువకుడు)
నగర పంచాయతీ ఏర్పాటు కోసం అందోల్‌ను విలీనం చేశారు. ఇక సమస్యలున్నీ తీరిపోతాయని అనుకున్నాం.ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నా యి. గ్రామంలో ఎక్కడ చూసిన పిచ్చి మొక్కలు, దుమ్ము, ధూళితో రోడ్లు దర్శనమి స్తున్నాయి. కొత్త రోడ్లు నిర్మాణం, మురికి కాల్వల నిర్మాణం కూడా లేదు. ప్రజల నుంచి పన్నుల రూపేనా వసూలు చేసే శ్రద్ధ అభివృద్ధి పనుల మీద చూపించడం లేదు. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగడంలేదు. ఎమ్మెల్యే పైన కౌన్సిలర్లు ఒక్కరిపై ఒక్కరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. సమస్యలు ఇక పరిష్కారం అయ్యే ఛాన్స్‌లేదని చెప్పవచ్చు.

Comments

comments