Search
Saturday 21 April 2018
  • :
  • :

భద్రాద్రి ఎన్‌కౌంటర్‌: మరో మృతదేహం లభ్యం

Seven Maoists Died in Encounter

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకులపల్లి మండలం మల్లెమడుగు సమీపంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సిపిఐ (ఎంఎల్ ) సిపి బాట పార్టీకి చెందిన ఎనిమిది మంది అజ్ఞాత దళ సభ్యులు హతమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రాంతానికి సమీపంలో శనివారం మరో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments