Search
Friday 20 April 2018
  • :
  • :

పోతన, సోమనాధుడు, వాల్మీకిలు తెలంగాణలో పుట్టడమే గర్వకారణం

jnm

తెలంగాణ కవులను సన్మానించేందుకే సభలు : ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి

పాలకుర్తి: బమ్మెర పోతన, పాలకుర్తి సోమనాధుడు, వాల్మీకి లాంటి కవులు తెలంగాణ గడ్డపై జన్మించడం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ ఎ శ్రీదేవసేన అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మి నర్సింహస్వామి గుట్ట వద్ద ఉన్న పాలకుర్కి సోమనాధుని విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఎ.శ్రీదేవసేన, ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంఎల్‌సి చుక్క రామయ్య, ప్రముఖ నవల రచయిత, అబషయ నవీన్, నాగిల్ల రామ శాస్త్రీలు హాజరై పూలమాలలు వేసి, నివాళ్ళు అర్పించారు. అదేవిధంగా బమ్మెరలోని పోతన స్మారక మందిరంలోని శ్రీరామ చంద్రుని ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోనాలు, కోలాటాలు డప్పు చప్పుళ్ళతో పోతన స్మారక సమాధి వద్దకు ద్వీపప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి, నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభలను పురస్క రించుకొని భాష, సాంస్కృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సభకు ఎంఎల్‌ఎ దయాకర్ రావు అధ్యక్షత వహించగ, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎ శ్రీదేవసేన హాజరై మాట్లాడుతూ వాల్మీకి, సోమనాధుడు, పోతనలు జన్మించి న ఈ ప్రాంతాలను పర్యాటకరంగంగా అభివృద్ధి చేసేందుకు రూ.40కోట్లు నిధులు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పోతన, సోమనాధుడు, వాల్మీకి అడిగిడిన ఈ నేలపై కవిత్వం జాలువారుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌గా ప్రజల కు పనిచేసేది తానేనని కాగా చేయించేవాడు మాత్రం రామభద్రుడేనన్నారు. తెలుగు భాషను రక్షించుకునేందుకే ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో చేయవల్సిన అభివృద్ధి పనులు పగడ్భందీగా త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.
పోతన సమాధిని ఏ ముఖ్యమంత్రి సందర్శించలేదు: ఎర్రబెల్లి
వాల్మీకి, సోమనాధుడు, పోతన నడియాడిన పాలకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించలేదని, రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే బొమ్మెర పోతన సమాధిని సందర్శించారని ఎంఎల్‌ఎ దయాకర్‌రావు అన్నారు. ఏడాదిలో బమ్మెరలో సమాధి అభివృద్ధి కళాక్షేత్ర నిర్మాణం, పర్యాటకులు తరలిరావడానికి బైపాస్ రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. అదేవిధంగా పాలకుర్తి గ్రామంలో సోమ నాధుడి పేరుతో ఆడిటోరియాల నిర్మాణం, బైపాస్‌రోడ్డు అండర్ గ్రేడ్ డ్రైనేజీ, చౌరస్తా నుండి 4 వైపుల రెండు కిలోమీటర్ల దూరం, రోడ్లకు ఇరువైపులా 4 లైన్ విస్తరన పనులు పూర్తిచేసి, పాలకుర్తిని అభివృద్ధిలో ముందుంచుతానని, అదేవి ధంగా వాల్మీకి స్వగ్రామం అయిన వల్మిడిగుట్టపై కాటేజీ నిర్మాణాలు చేపడ తామన్నారు. తెలంగాణలో పుట్టిన కవులు, కళాకారులు, రచయితలను సన్మా నించుకోవడం కోసమే సిఎం కేసీఆర్ ప్రపంచ మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన పనితీరు బేష్‌గా ఉందన్నారు. ఆమె కూడా కవి అని దయాకర్‌రావు అన్నారు.
ఏ ప్రభుత్వం ఈ ప్రాంత కవులను గుర్తించలేదు: చుక్క రామయ్య
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కవులను గుర్తించలేదని మాజీ ఎంఎల్‌సి చుక్క రామయ్య అన్నారు. త్యాగానికి, సాంస్కృతికి నిలయం పోతన సాహిత్యం అని అన్నారు. తెలంగాణలోని ఏదైనా ఒక విశ్వవిద్యాలయాలనికి పోతన పేరు పెట్టాలని కోరారు. ఈ ప్రాంతంలో చదువుకుంటున్న విద్యార్థులు పోతన పద్యాలు కంఠస్తం చేసేలా ఉపాధ్యాయులు ఆ దిశగా పని చేయాలని సూచించా రు. పోతన వ్రాసిన పద్యాలను ముద్రించి, ఒకటవ తరగతి విద్యార్థులకు పోటీ లు నిర్వహించాలన్నారు. పోతన ఈ ప్రాంతానికి చెందినవాడే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని, వాటిలో పోతన సాగుచేసిన వ్యవసాయ భూమి, భావి, తల్లి పేరున వాగు, కుమారుని పేరున మల్లన్న గుడి అనేకం ఉన్నాయని, ఒంటి మిట్టలో ఇవేమి లేవన్నారు.
సోమనాధుడు ఆధి కవి, పోతన సహజ కవి :- అబషయ నవీన్
పాలకుర్తి సోమనాధుడు, ఆది కవి బమ్మెర పోతన సహజ కవి అని ప్రముఖ నవల రచయిత, కేంద్ర సాహిత్య అకాడమి, అవార్డు గ్రహీత అపషయ నవీన్ అన్నారు. సోమనాధుడు ద్విపదంలో రచనలు చేశారని, సామాన్య ప్రజలకు అర్థం అయ్యే రీతిలో రాశారని అన్నారు. 11వ శతాబ్ధంలోనే తొలి విప్లవ కవిగా పేరు గాంచిన కవి పాలకుర్కి సోమనాధుడని కొనియాడారు.
సోమనాధుడు ధిక్కార కవి: నాగిళ్ళ రామశాస్త్రీ
పాలకుర్కి సోమనాధుడి రచనలు విప్లవ పంథాలో ఉంటాయని అందుకే ధిక్కార కవి అని కాళోజి ట్రస్టు చైర్మెన్ నాగిల్ళ రామశాస్త్రీ అన్నారు. పాలకుర్కి సోమనా ధుడు కాళోజి నారాయణ రావులు ఇద్దరు బడుగు బలహీన వర్గాల కోసం రచన లు చేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో కవులను గుర్తించి, వారిని సన్మానించ డం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ డిసిపి మల్లా రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎం వనజా దేవి, స్టేషన్‌ఘనపురం ఆర్డిఓ రమేష్, గ్రామ సర్పంచ్ వంగాల ఎల్లమ్మ, పాలకుర్తి, దేవరుప్పుల ఎంపిపిలు దళ్జిత్ కౌర్, సోమనర్సమ్మ, ఎంపిటిసి కృపాకర్, తహశీల్ధార్ బన్సిలాల్, ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ నల్ల నాగిరెడ్డి, వంగాల సురేందర్, సాహితి ప్రియులు నర్సింహ్ములు, రత్నాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. అనంతరం కవులను, రచయితలను కలెక్టర్ శ్రీదేవసేన, ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్ రావులు ఘనంగా సన్మానించారు.

Comments

comments