Search
Sunday 20 May 2018
  • :
  • :
Latest News

ఎపిలో నిరుద్యోగులకు తీపి కబురు

Ganta-Srinivas-Rao

అమరావతి: నిరుద్యోగులకు ఎపి ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిఎస్‌సికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను విడుదల చేశారు. ఈ నెల 15న సిలబస్, నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామన్నారు. మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రాత పరీక్షలు మార్చి 23, 24, 26న ఉంటాయన్నారు. తుది కీని ఏప్రిల్ 30న విడుదల చేసి, మే 5న మెరిట్ లిస్ట్ వెల్లడిస్తామని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

AP DSC 2018 Notification Schedule Released.

Comments

comments