Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

యాపిల్ కస్టమర్లకు న్యూయర్ గిఫ్ట్

Iphone-image

శాన్‌ఫ్రాన్సిస్‌కో: యువత ఐపోన్ అంటే ఐస్ క్రీం లెక్క.. అంటే అంత మక్కువ చూపిస్తారు. పాత ఐఫోన్ మోడల్స్ అన్ని స్లోగా మారడానికి తామే కారణమని ఆ యాపిల్ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. పోన్లలలో రారాజు అయిన యాపిల్  సంస్థ తమ కష్టమర్లకు  క్షమాపణలు కోరింది.  అయితే ఆ పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి యాపిల్  సంస్థ ఒప్పుకుంది. అతి తక్కువ ధరలకే యాపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనుంది.  పాత ఐఫోన్ల కోసం 2018లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను కూడా రిలీజ్ చేయనున్నది. దాని వల్ల కస్టమర్ల తమ ఐఫోన్లను మానిటర్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. ఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకోవాలన్న ఆలోచనతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో చేసిందన్న పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు యాపిల్ సంస్థ తెలిపింది. ఐఫోన్ 6 నుంచి ఆ తర్వాత వచ్చిన మోడల్స్‌కు కేవలం 79 డాలర్లకే కొత్త బ్యాటరీని ఇస్తున్నారు.

Comments

comments